లోని, ఘజియాబాద్

లోని ప్రాంతం శ్రీరాముడి కాలం నాటిది. శ్రీరాముడి సోదరుడైన శత్రుఘ్నుడు లవనాసురుడు అనే రాక్షసుడిని ఇక్కడ చంపాడని చెపుతారు. మరో కధనంగా ఈ పట్టణాన్ని లోన్నకారాన్ అనే రాజు కనుగొన్నాడని, అక్కడ లోని అనే కోట కట్టించాడని చెపుతారు. ఈ కోట సుమారుగా 1789 వరకూ వుంది. తర్వాత కాలంలో దానిని పడ గొట్టి మహమ్మద్ షా దాని ఇటుకలు ఇతర భవన సామాగ్రితో ఒక కొలను, గార్డెన్ నిర్మించాడు. చరిత్రకారుల మేరకు లోని పృద్విరాజ్ చౌహాన్ సామ్రాజ్యంలో భాగం గా వుండేది. అతను కట్టిన కోట అవశేషాలు పర్యాటకులు ఇంకా ఇక్కడ చూడవచ్చు. మొగలుల కాలం లో ఇక్కడ మూడు పెద్ద తోటలు నిర్మించారు. అవి ఖరంజి బాగ్, ఉల్దిపూర్, రానాప్ తోటలు గా పిలుస్తారు.

మొదటి రెండు తోటలు మొగల్ చక్రవర్తి బహదూర్ షా భార్య నిర్మించగా, బ్రిటిష్ ప్రభుత్వం ఈ తోటలను స్వాధీనం చేసుకొని వాటిని మీరట్ రాజు షైక్ ఇలాహి బక్షి కి అమ్మివేసింది. మూడవ తోట రానాప్ లేదా అబది బాగ్ రానాప్ సరిహద్దు గోడను నేటికి ఇక్కడ చూడవచ్చు.

Please Wait while comments are loading...