ఘజియాబాద్ నుండి మురాద్ నగర్ 14 కి.మీ.ల దూరం లో మోదినగర్ తాలుకాలో కలదు. దీనిని ఒక మొగల్ చక్రవర్తి సుమారు 400 ఏళ్ల క్రిందట స్థాపించాడు. ప్రఖ్యాత క్రికెట్ ఆటగాడు సురేష్ రైనా ఈ ప్రదేశానికి చెందినవాడు. హరిద్వార్ నుండి ప్రవహించే గంగా నహార్ ఈ టవున్ గుండా ప్రవహిస్తుంది. ఈ ప్రదేశం స్థానికులకు ఒక పిక్నిక్ స్పాట్ గా వుంటుంది. మురాద్ నగర్ లో కాటన్ బట్టలు ప్రత్యేకించి బెడ్ షీట్ లు హ్యాండ్ లూం మరియు జరి పనుల యూనిట్ లు కలవు. ఇక్కడ భారత ప్రభుత్వ రక్షణ శాఖ ఒక ఆర్డినెన్సు ఫ్యాక్టరీ పెట్టింది. ఇది దేశ రాజధాని ఢిల్లీ లో ఒక భాగం గా వుంటుంది.



Click it and Unblock the Notifications