వేల్నేశ్వర్, గుహఘర్

వేల్నేశ్వర్ గ్రామం గుహఘర్ నుండి సుమారు 20 కి.మీ. ల దూరంలో కలదు. ఇక్కడ గ్రామం పేరుతోనేగల  బీచ్ ప్రసిద్ధి గాంచినది. ఈ గ్రామంలో అధికంగా మత్స్యకారులే ఉంటారు. శాస్త్రీ నది ఒడ్డున కలదు. గ్రామం శుభ్రంగా, అందంగా ఉంటుంది. వేల్నేశ్వర్ బీచ్ ప్రసిద్ధ ఆకర్షణ. బీచ్ సమీపంలో కొబ్బరి తోటలు కలవు. బీచ్ అంతా తెల్లని ఇసుక. వేల్నేశ్వర్ బీచ్ లో నీటి ఆధారిత క్రీడలు అంటే స్విమ్మింగ్, మోటర్ బోటింగ్ వంటివి ఆచరించవచ్చు.                      

ఈ గ్రామం గుహఘర్ - హెద్వి మెయిన్ రోడ్ పై కలదు. ఇక్కడ ఒక శివాలయం కలదు. మహా శివరాత్రికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ దేవాలయం ప్రవేశంలో ఒక పెద్ద దీపమాల మరియు సమీపంలో కాల భైరవ, గణేశ, మరియు శివ దేవాలయాలు కూడా ఉంటాయి.

Please Wait while comments are loading...