ఫిరోజ్ పూర్ నాలాను శిన్ మహిన్యు అని అంటారు. ఇది ఒక పర్వత జలపాతం ఫిరోజ్ పూర్ శిఖరం నుండి పడుతుంది. ఇది గుల్మార్గ్ కు 5 కి. మీ. ల దూరం లో కలదు. చేపలు పట్టుటలో ఆసక్తి కలవారు ఇక్కడకు వచ్చి ఆనందించవచ్చు. ఈ ప్రవాహం స్థానికులకు తాగు నీటిని అందిస్తుంది. ఈ నీరు ఎంతో పవిత్రమైన నీరుగా వారు భావిస్తారు. ఈ జలపాతం చివరకు బహాన్ నది లో వాటర్స్ మీట్ అనే ప్రసిద్ధ ప్రదేశం లో కలసి పోతుంది ఫిరోజ్ పూర్ నాలా తోసా మైదాన్ సమీపంలో కలదు. తొసమైదాన్ చేరాలంటే 50 కి. మీ.ల దూరం ట్రెక్కింగ్ చేయాలి. మూడు రోజులలో చేరవచ్చు.



Click it and Unblock the Notifications