ఈ దేవాలయంలో 3.6 మీటర్ల ఏకశిలపై చేయబడిన ఉద్దాన వీరభద్ర విగ్రహం ఉంటుంది. వీరభధ్రుడు శివుడి అవతారం. విగ్రహానికి నాలుగు చేతులు, చేతిలో కత్తి, బాణం, ధనస్సు మరియు షీల్డు లు ఉంటాయి. ఈ దేవాలయం సందర్శించే భక్తులు ఇక్కడే చిన్న దక్ష విగ్రమం మరియు సర్వాంగ లింగం(శివ) కూడా చూడవచ్చు. ఫొటోగ్రఫీ ఇక్కడ అనుమతించబడదు. వీరభధ్రుడి పుటుకకు ఇక్కడే అనేక హిందు పురాణగాధలు నడిచాయని చెపుతారు. జనబాహుళ్యంలో కల నమ్మకాల మేరకు వీరభధ్రుడు శివుడి అవతారం. శివుడి భార్య తన తండ్రిచే అవమానించబడి ఆత్మహత్య చేసుకుంటుందని, అందుకు కోపించిన శివుడు వీరభద్ర అవతారంలో తన మామ అయిన దక్షుడిని వధిస్తాడని చెపుతారు. ఈ దేవాలయం శివుడి ఉగ్ర రూపాన్ని వీరభధ్రుడి అవతారంలో చూపుతుంది. ఈ దేవాలయం మెయిన్ రోడ్ లో సెక్రెడ్ సెంటర్ మరియు రాయల్ ఎనక్లోజర్ ల మధ్యగా కనపడుతుంది. యుద్ధాలలో మరణించిన సైనికుల భార్యలకు నివాళిగా ఒక సతి రాయి మరియు ఏకశిల దీపం కూడా ఇక్కడ ఉంటాయి. హంపి మెయిన్ రోడ్ ఈ దేవాలయం ద్వారా పోతుంది. ఇది చండికేశ్వర దేవాలయం ఎదురు భాగంలో కలదు.



Click it and Unblock the Notifications