Search
  • Follow NativePlanet
Share

హస్సన్ - శిల్పకళా రాజధాని

11

కర్ణాటక లోని హస్సన్ నగరం, హస్సన్ జిల్లా ప్రధాన కేంద్రం. ఇది 11 వ శతాబ్దంలో చన్న కృష్ణప్ప నాయక్ అనే సామంత రాజుచేత ఏర్పాటుచేయబడింది. స్థానిక దేవత అయిన హస్సనంబ పేరిట ఏర్పడ్డ ఈ జిల్లా కర్నాటకకు శిల్ప రాజధాని అయింది. హోయసల వంశీయుల గొప్ప సంస్కృతి జిల్లా అంతటా కనిపిస్తుంది.

11 వ శతాబ్దం నించి 14వ శతాబ్దం వరకు, అప్పటి రాజధాని నగరమైన ద్వార సముద్ర౦ నుంచి, హోయసల వంశీకులు పరిపాలించారు. హస్సన్ జిల్లాలోని హలేబిడ్ చుట్టూ శిధిలాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఆ రాజులు జైన మతానికి చెందినవారయినప్పటికీ, ఆ ప్రాంతం మొత్తం శివాలయాలతో నిండి ఉంటుంది.

చారిత్రిక విలువలకు ప్రసిద్ది పొందిన హస్సన్ నగరం ఇపుడు బాగా అభివృద్ది చెంది,. 

ఇది 157000 మంది జనాభాతో 26.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది.

నగరం గురించి 

హస్సన్ జిల్లా మల్నాడ్, మైదాన ప్రాంతం కిందకి వస్తుంది, జిల్లా మొత్తం అందమైన వాతావరణంతో ఆహ్లాదపరుస్తుంది. హస్సన్ నగరంలో  ఉదయాలు వెచ్చగాను, సాయంకాలాలు చల్ల గానూ వుంటాయి.

రాష్ట్ర రాజధాని బెంగళూరు నుంచి 187 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ నగరం 79 శాతం అక్షరాస్యతతో  – మల్నాడ్ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్, శ్రీ ధర్మస్థల మంజునాథ కాలేజ్ అఫ్ ఆయుర్వేదా లాంటి రాష్ట్రం లోని అత్త్యుత్తమ పాఠశాలలు, కళాశాలలు కూడా కలిగి వుంది. ఇక్కడి అధికార భాష కన్నడం ఐనప్పటికీ ఇంగ్లీష్, హిందిలు కూడా ఎక్కువ మందే మాట్లాడతారు.

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థలో సింహ భాగం కలిగిన వ్యవసాయం ఇక్కడి ప్రధాన వ్యాపకం. దీనితో పాటు, మైసూర్ మినరల్స్  ద్వారా క్రోమైట్ మైనింగ్ కూడా ఆర్ధిక వ్యవస్థకు ఊతమిస్తోంది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రధాన నియంత్రణ కేంద్రానికి హస్సన్ ప్రధాన కేంద్రం.

హస్సన్ నగరానికి రోడ్డు, రైలు మార్గం ద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి ఇది బాగా అనుసందానించ బడి వుంది. 115 కిలో మీటర్ల దూరంలోని మంగళూరు, 187 కిలోమీటర్ల దూరం లోని బెంగళూరు ఇక్కడికి దగ్గర లోని విమానాశ్రయాలు – అందువల్ల హస్సన్ సందర్శించడం పెద్ద కష్టమేమీ కాదు.

హస్సన్ చుట్టు పక్కల ఆకర్షణలు.

స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే హస్సనాంబ దేవాలయానికి భక్తులు, యాత్రికులు విరివి గా వస్తారు.

బేలూర్, హాలేబీడు, శ్రావణ బెలగోళ, గోరూర్ డామ్, ఇక్కడి ప్రసిద్ధ ఆకర్షణలు. మూడు నుంచి అయిదు నక్షత్రాల హోటళ్ళతో అసంఖ్యాకమైన యాత్రికులను ఆడరించేందుకు హస్సన్ సిద్ధంగా వుండడం వల్ల ఈ వూళ్ళో వసతికి ఇబ్బందేమీ లేదు. కర్ణాటక లోని చరిత్ర, సంస్కృతి పట్ల అవగాహన పెంచుకోవాలని మీరనుకుంటే, మీరు తప్పక హస్సన్ వెళ్లాల్సిందే.

హస్సన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హస్సన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హస్సన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హస్సన్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: హాసన్ కి సమీపంలోని బెంగళూరు, మైసూర్, మంగళూర్, మడికేరి, సహా పలు నగరాలకు, పట్టణాలకు KSRTC (కర్ణాటక రాష్ట్ర రోడ్డు రావా ణా సంస్థ) ద్వారా బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా: నగరం నుండి 2 కిలోమీటర్ల దూరంలో హాసన్ లో రైల్వే స్టేషన్ ఉంది. హసన్ రైల్వే స్టేషన్ బెంగళూరు, మైసూర్, మంగళూరు లాంటి ప్రధాన నగరాలకు, సమీప పట్టణాలకు అనుసంధానించబడి ఉంది. ఇక్కడికి చేరిన తరువాత, పర్యాటకులు సమీపంలోని ప్రదేశాలు చూడటానికి టాక్సీలు, కాబ్స్ బాడుగకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    చేరుకోవడం ఎలా పర్యాటకులు హాసన్ ని చేరుకోవడానికి విమానాలు, రైళ్ళు, రోడ్డు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. వాయు మార్గం: హసన్లో విమానాశ్రయం లేదు, కాని 117 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి దగ్గర విమానాశ్రయం. ఇది జాతీయ, అంతర్జాతీయ విమాన సేవలను అందిస్తుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun