భాయి ధరం సింగ్ గురుద్వారా ను సైఫ్ పూర్ లో హస్తినాపూర్ కు 2.5 కి.మీ.ల దూరంలో స్థాపించారు. భాయి ధరం సింగ్ సిక్కుల గురువు గురు గోవింద సింగ్ అమితంగా అభిమానించే శిష్యులలో ఒకరు. గురు గోవింద సింగ్ కొరకు ఒకప్పుడు ఆయన కోరిక మేరకు అయిదుగురు శిష్యులు ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమయారు.
ఆ అయిదుగురు శిష్యులలో భాయి ధరం సింగ్ ఒకరు. భాయి ధరం సింగ్ మొదటగా జాట్ తెగకు చెందినవాడు. మొదటి పేరు ధరం దాస్ గా వుండేది. ఆయన హస్తినాపూర్ లోని సైఫ్ పూర్ కరంచంద్పూర్ లో 1666 లో జన్మించారు. చిన్నతన్నం లోనే సిక్కు మతంలో చేరారు. చివరకు 1708 లో తన 42 వ ఏట గురుద్వారా నాందేడ్ సాహిబ్ లో మరణించారు. సిక్కులకు భాయి ధరం సింగ్ గురుద్వారా ఎంతో పవిత్రమైనది.



Click it and Unblock the Notifications