ఇటార్సి పర్యటన లో ఎవాన్జలికల్ లూథరన్ చర్చి ఒక ప్రసిద్ధ ఆకర్షణ. మధ్య ప్రదేశ్ లోని ఈచిన్న నగరం లోని ఈ చర్చి ఇక్కడి ప్రజల మతపర సహనానికి ప్రతీకగా నిలుస్తుంది. అన్ని మతాల ప్రజలు ఇక్కడ సఖ్యత తో జీవిస్తారు. దీనికి నిదర్సన మిక్కడ వివిధ మతాల క్షేత్రాలు ఉండటమే. ఎవాన్జలికల్ చర్చి కి క్రిస్టియన్ లు మాత్రమే కాక ఇతరమతాల వారు కూడా వచ్చి తమ భక్తి విశ్వాసాలు చాటుకుంటారు.
చర్చి యొక్క శిల్ప శైలి అద్భుతంగా వుంటుంది. కనుక ఇటార్సికి వచ్చిన పర్యాటకులు తప్పక ఈ చర్చి సందర్శించి ఆనందిస్తారు. ఈ చర్చి అనేక ఇతర సాంఘిక, అభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది. ఈ కారణంగా కూడా ఈ చర్చి ప్రసిద్ధి చెందినది. ఆటో రిక్షాలు,లేదా టాక్సీలలో ఈ చర్చి ని తేలికగా చేరవచ్చు.



Click it and Unblock the Notifications