ఝాన్సీ లో ని రెండు ముఖ్య మైన ప్రదేశాలను సూచిస్తుంది పరిచా అనే పేరు. వాటిలో ఒకటి నగరం నుండి 25 కిలోమీటర్ల దూరం లో ఉన్న బెట్వా నది పై న డ్యాం. ఇందులో ఉన్న రిజర్వాయర్ లో ని నిల్లు దాదాపు 34 కిలోమీటర్ల దూరం లో ఉన్న నోట్ఘాట్ బ్రిడ్జి వరకు చేరుకుంటాయి. జల క్రీడలని ప్రత్యేకించి బోటింగ్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ డ్యాం ముఖ్యమైన ప్రదేశం.
ఝాన్సీ జిల్లాలో కాన్పూర్-ఝాన్సీ రహదారిపై ఉన్న కాలనీ పేరు పరిచా. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (C.I.S.F.) రక్షణలో ఉన్న ఈ ప్రాంతం పరిచా ఒక పెద్ద బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ అయిన థర్మల్ పవర్ స్టేషన్ కి సమీపం లో ఉంది. ఇది దాదాపు 1140 మెగా వాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది.
దేవాలయం, మసీదు, చర్చ్ మరియు బౌద్ధ ఆశ్రమానికి నివాసం పరిచా. బ్యాంకులు, పార్కులు, వివిధ రకాల నాలుగు క్లబ్బులు, ఒక గెస్ట్ హౌస్, హాస్పిటల్, కాలేజీ మరియు మహారాణి లక్ష్మీ బాయి సరస్వతి శిశు మందిర్ ఇంకా సేక్రేడ్ హార్ట్ కాన్వెంట్ స్కూల్ వంటి పేరున్న స్కూళ్ళు ఈ ప్రాంతం లో కలవు.



Click it and Unblock the Notifications