అస్సా౦ సాహిత్య సభ కు చంద్రకాంత హాండిక్ భవనం ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది. 1926 లో రాధాకాంత హాండిక్ స్మారకంగా నిర్మించిన ఈ భవనాన్ని ఆయనే విరాళంగా ఇచ్చారు. నగరం ప్రసిద్ది చెందినా సాహిత్య ఔన్నత్యానికి ఈ చంద్రకాంత భవనాన్ని చిహ్నంగా భావిస్తారు. అస్సాం సాహిత్య సభకు ప్రధాన కేంద్రంగా ఉండడమే కాకుండా చంద్రకాంత హాండిక్ భవనం అస్సామీ సాహిత్య వ్యాప్తికి ఎంతగానో దోహదం చేసింది.
లబ్ధ ప్రతిష్టులైన ఎంతో మంది రచయితలు దీనికి అధిపతులుగా వున్నారు. దిమ్బేశ్వర నియోగ్, చంద్రదర్ బరువా, మిత్రదేవ్ మహంతా ఈ సభతో సన్నిహితంగా పనిచేసారు. చంద్రకాంత హాండిక్ భవనాన్ని చూస్తె రాష్ట్ర సాహిత్య ఔన్నత్యంతో పాటు జోర్హాట్ సాంస్కృతిక పరంగా ఎంత ముఖ్యమైనదో తెలుస్తు౦ది.
ప్రజా రవాణా వ్యవస్థ లేదా ప్రైవేటు వాహనాల ద్వారా చంద్రకాంత హాండిక్ భవనానికి తేలిగ్గా చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications