మొదటి అహోం రాజు సుకఫా స్మారకార్ధం నిర్మించిన కట్టడం సుకఫా సంన్నాయ్ క్షేత్ర. జోర్హాట్, దేర్గావ్ లకు దగ్గరలో మొహబంధ వద్ద వుంది సుకఫా సమన్నాయ్ క్షేత్ర.
దాదాపు ఆరు వందల సంవత్సరాలు వర్ధిల్లిన అహోం రాజ్యాన్ని స్థాపించిన వాడు సుకఫా. థాయి యువరాజు సుకఫా పాట్కాయి కొండలు దాటి ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతంలోని గిరిజన, గిరిజనేతర తెగలను కలిపిన ప్రధానమైన వ్యక్తీ అతను. సుకఫా అద్వితీయ నాయకత్వానికి చిహ్నంగా సుకఫా సమన్నాయ్ క్షేత్రాన్ని నిర్మించారు. అందువల్ల సుకఫా సమన్నాయ్ క్షేత్ర సందర్శన లో చూడాల్సిన ఆసక్తికరమైన విషయాలు ఎన్నో వున్నాయి.
ప్రస్తుతం ఈ స్థలం లో ఒక తవ్వకపు ప్రాజెక్ట్ నడుస్తోంది. అహోం రాజ్యపు ఆనవాలను కనుగొనేందుకు ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. సుకఫా సమన్నయ క్షేత్రాన్ని చేరుకోవాలంటే యాత్రికులు కాబ్ లు, ఆటో లు, సిటీ బస్సుల ద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications