కన్నూర్ నుండి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న పప్పినిస్సేరి అను చిన్న గ్రామం ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలకి, ఆలయాలకి ప్రసిద్ది. బలియపటం నది, చుట్టు పక్కల చిన్న పర్వతాలు ఈ గ్రామాన్ని సందర్శించే పర్యాటకులకి కనువిందు చేస్తాయి. పంపురుతి (నది లో ఉన్న అందమైన ప్రదేశం), వాదేశ్వరం హిల్ (కేరళ కైలసంగా స్థానికంగా ప్రసిద్ది) పప్పినిస్సేరి లో ఉన్న ప్రధాన ఆకర్షణలు.
మూన్ను పెట్టుమ్మ పల్లి లేదా కట్టిలే పల్లి ఈ గ్రామంలో ఉన్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ మాస్క్ లో జరిగే ప్రధాన పండుగ కట్టిలే పల్లి నేర్చా. ఎంతో మంది భక్తులని మరియు పర్యాటకులని కేరళ నలుమూలల నుండి ఈ పండుగ ఆకర్షిస్తుంది. ఉత్తర మలబార్ యొక్క శ్రీ కైలాసంగా పేరొందిన శ్రీ వాదేశ్వరం శివ టెంపుల్ సుందరమైన కొండపై ఉన్న ప్రధాన హిందువుల దేవాలయం.
ఆరోన్ చర్చ్ మంకండవు జుమ మస్జిద్ మరియు కీచేరి పాలోట్టు కావు ఇక్కడున్న మరికొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు. పాముకాటుకి చికిత్స జరిగే కేంద్రం లేదా విష చికిత్స కేంద్రంగా ఈ పప్పినిస్సేరి ప్రసిద్ది.