కన్నూర్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణం పెరలస్సేరి. కన్నూర్-కూతుపరంబ ప్రధాన రహదారి వద్ద ఉన్న ఈ ప్రదేశానికి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ఇక్కడి సుబ్రమణ్య స్వామీ దేవాలయం, కేరళ నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. భగవంతుడు రాముడు లక్ష్మణునితొ కలిసి లంకకు సీతమ్మ వారిని విడిపించడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆగారని ప్రజల నమ్మకం.
ఈ గుడిలో మురుగన్ లేదా సుబ్రమణ్య స్వామీ కొలువై ఉంటారు. ఈ ఆలయంలో కనబడే రాగి మరియు కాంస్యం తో తయారు చేసిన నాగ విగ్రహాలు ప్రధాన విశేషం. ఇక్కడ ఉన్న దిగుడు బావి తన నిర్మాణ శైలితో పర్యాటకులని ఆకర్షిస్తుంది. సీతంకన్ తుల్లాల్, చక్యర్కూతు, ఒత్తంతుల్లాల్, కథాకళి మరియు పరయన్ తుల్లాల్ వంటి జానపద నృత్యాలని ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇక్కడ నాగ విగ్రాహాలకి గుడ్లను నైవేద్యంగా పెట్టె సంప్రదాయం ఉంది. దీనిని, ముట్ట ఒప్పికల్ అని అంటారు.



Click it and Unblock the Notifications