కమల రిట్రీట్ కాన్పూర్ లో ఒక ప్రసిద్ధ పర్యాటక విశ్రాంత ప్రదేశం. దీనిని ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త శ్రీ పదం పాత్ సింఘానియా 1960లో కమల నెహ్రు రోడ్ లో నిర్మించారు. ఈ పార్క్ ప్రైవేటు ఆస్తి అయినప్పటికీ దీనిలో మ్యూజియం, పార్క్ లు, లాన్ లు కేనాల్స్ , బోటింగ్ సౌకర్యాలు వంటి కొన్ని పర్యాటక ఆకర్షణలు కలవు. కృత్రిమ అలలలను కలిగిస్తూ హై టెక్ అంశాలతో కూడిన ఒక స్విమ్మింగ్ పూల్ కూడా కలదు. రాత్రి వేళ స్విమ్మింగ్ పూల్ లైట్ లు ఏర్పాటు మరొక అద్భుత ఆకర్షణ. ఇక్కడే ఒక జూ కూడా కలదు.
దీనిలో అనేక పక్షులు, పాము జాతులు, జంతువులు స్వేచ్చగా సంచరిస్తూ వుంటాయి. ఈ రిట్రీట్ లో పండిట్ జవహర్లాల్ నెహ్రు, చైనా ప్రధాని చౌ ఎన్ లై వంటి వారు 1962 చైనా యుద్ధ సమయమపుడు, ఆతిధ్యం పొందారు. ఈ రిట్రీట్ చూడాలంటే ముందస్తు అనుమతులు కావాలి.



Click it and Unblock the Notifications