భన్వర్ విలాస్ ప్యాలెస్ 1938 లో అప్పటి కరౌలి రాజు మహారాజ గణేష్ పాల్ దేవ్ బహదూర్ చే నిర్మించబడింది. ఇది ఒక రాజ భవనంగా వారికి ఉండేది. ఈ ప్యాలెస్ లోని 45 గదులను ఆధునికంగా నిర్మించారు. ఆధునిక ఫర్నిచర్ అలంకరించారు. నేడు అది ఒక హెరిటేజ్ హోటల్ గా వాడబడుతోంది.
...సిటీ ప్యాలెస్ ను 14వ శతాబ్దంలో రాజ కుటుంబీకులు నిర్మించారు. శిల్పకళకు, పెయింటింగ్ లకు ఇది ప్రసిద్ధి చెందింది. దర్బార్ హాలులో 600 సంవత్సరాల క్రిందటి పురాతన చిత్రాలను సైతం ప్రదర్శిస్తారు.
1938 సంవత్సరం వరకు ఈ భవనం రాచ కుటుంబీకులకు నివాసం. భన్వర్ విలాస్ భవనం...
ఈ దేవాలయాన్ని మహారాజు గోపాల్ సింగ్ సుమారు 200 సంవత్సరాల కిందట నిర్మించారు. ఈ దేవాలయంలో కళ్యాణి పాతా ఉంటుంది. కరౌలిని ఈ దేవాలయం పేరుపై మొదట్లో కళ్యాణపురి అని పిలిచేవారు. ప్రాచీన దేవాలయ శిల్ప సంపద అద్భుతంగా ప్రదర్శించబడుతోంది.. కరౌలి అభివృధ్ధి చెందటానికి ఇక్కడి...
కేలాదేవి వైల్డ్ లైఫ్ శాంక్చురీ రాజస్ధాన్ - మధ్య ప్రదేశ్ సరిహద్దులలో కలదు. సుమారు 676.40 చ. కి.మీ.ల పరిధిలో విస్తరించి ఉంది. బనాస్ నది ఈ శాంక్చురీ పడమటి భాగంలో ప్రవహిస్తుంది. చంబల్ నది ఆగ్నేయ దిశలో ప్రవహిస్తుంది. ఈ శాంక్చురీ ని కేలా దేవి లేదా కైలా దేవి దేవాలయం...
తిర్మన ఘర్ కోట కరైలిలో మసాల్ పూర్ తాలూకాలో ఉంది. ఇక్కడి కోటను సుమారు క్రీ.శ. 1100 లలో నిర్మించారని చరిత్రకారులు చెపుతారు. అయితే అది వెంటనే విధ్వంసం చేయబడింది. మరో మారు దీనిని యదువంశి రాజు తిమ్మనపాల్ 1244 లో పునరుద్ధరించాడు. కోట కింది దేవాలయాలలో ఎన్నో రాతి...
మదన్ మోహన్ జీ దేవాలయం కరౌలి కోటలో కలదు. దీనిని మహారాజా గోపాల్ సింగ్ నిర్మించారు. మదన్ మోహన్ జీ ని క్రిష్ణుడి అవతారంగా భావిస్తారు. ఇక్కడ రాధా క్రిష్ణుల విగ్రహాలు సుమారు రెండు మరియు మూడు అడుగుల ఎత్తు కలిగి ఉంటాయి. వీటిని అజ్మీర్ లోని ఒక దేవాలయంనుండి తన విజయానికి...
రామత్ర కోట రాజస్ధాన్ లోని కరౌలి జిల్లాలో కేలా దేవ్ ఘన బర్డ్ శాంక్చురీ మరియు రణధంబోర్ టైగర్ రిజర్వ్ ల మధ్య కలదు. కేలా దేవి శాంక్చురీ దీనికి సమీపంగా ఉంటుంది. సుమారు 15 కి.మీ. ల దూరం. పర్యాటకులకు ఈ కోట అక్కడి గ్రామీణ సౌందర్యాలను చూపుతుంది. ఈ కోటను 1645 లో ఒక...
ఈ కోట సుమారు 250 సంవత్సరాల క్రిందటిది. అమర్ ఘర్ గ్రామంలో కలదు. రాజు అమర్ పేరుపై ఈ కోట నిర్మించారు. చుట్టుపక్కల పూర్తి పచ్చని ప్రదేశాలు, వరి పొలాలు కలవు. అన్ని వైపులనుండి అడవి మరియు పర్వతాలు వ్యాపించి పర్యాటకులకు ఎంతో అందంగా కనపడతాయి.
శ్రీ మహావీర్ జీ దేవాలయం చందన్ గాంవ్ గ్రామంలో కలదు. దీనిలో 78 సెం.మీ. ల ఎత్తు లార్డ్ మహావీరుడి విగ్రహం పెట్టబడింది. దీనిని సమీప గ్రామంలో ఎన్నో ఏళ్ళ కిందట భూమినుండి బయటకు తీసారు. విగ్రహం పద్మాసనంతో కూడిన మహావీరుడిని రాగి ప్రతిమగా చూపుతుంది.
కరౌలిలోని దుకాణాలలో పర్యాటకులు అనేక వస్తువులను చేతి కళలతో తయారు చేసిన వాటిని కొనుగోలు చేయవచ్చు. దుస్తులు, గాజులు, రగ్గులు, ఇంకా అలంకరణ సామాగ్రి స్ధానిక చేతికళలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడి గాజుల మార్కెట్ లో మహిళలు అధిక సంఖ్యలో కనపడతారు. స్ధానిక బజార్ లో...