తిర్మన ఘర్ కోట కరైలిలో మసాల్ పూర్ తాలూకాలో ఉంది. ఇక్కడి కోటను సుమారు క్రీ.శ. 1100 లలో నిర్మించారని చరిత్రకారులు చెపుతారు. అయితే అది వెంటనే విధ్వంసం చేయబడింది. మరో మారు దీనిని యదువంశి రాజు తిమ్మనపాల్ 1244 లో పునరుద్ధరించాడు. కోట కింది దేవాలయాలలో ఎన్నో రాతి శిల్పాలు పురాతనమైనవి ఉన్నట్లు స్ధానికులు చెపుతారు.
దేవాలయ గోడలు పూర్తిగా దేవతల బొమ్మలతో చెక్కబడి ఉంటాయి. చరిత్ర ఆధారాల మేరకు ఈ కోటను మహమ్మద్ ఘోరి 1196 - 1244 ల మధ్య స్వాధీన పరచుకున్నాడని తెలుస్తోంది.



Click it and Unblock the Notifications