Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కార్గిల్

కార్గిల్  - లైన్ ఆఫ్ కంట్రోల్ !

32

కార్గిల్ జమ్మూ & కాశ్మీర్ లోని లడఖ్ లో ఒక జిల్లా గా వుంది. కార్గిల్ ను ల్యాండ్ ఆఫ్ ఆగాస్ అని కూడా పిలుస్తారు. ఈ జిల్లాలో షియా ముస్లిములు అధికంగా వుండటం చేత దీనికి ఈ పేరు వచ్చింది. శ్రీనగర్ కు సుమారు 205 కి. మీ.ల దూరం లో వున్న కార్గిల్ పాకిస్తాన్ తో మనకు గల లైన్ ఆఫ్ కంట్రోల్ కు దగ్గరగా కాశ్మీర్ వాలీ వైపుగా వుంది. ఈ ప్రదేశంలో ఒకప్పుడు అంటే 1999లో ఇండియా, పాకిస్తాన్ యుద్ధం జరిగింది దానిని కార్గిల్ యుద్ధం లేదా కార్గిల్ వివాదంగా చెపుతారు.

కార్గిల్ అంటే రెండు పదాల సముదాయం. 'ఖార్' అంటే భవనం మరియు 'ఇర్కిల్ ' అంటే కేంద్రం అని అర్ధం వస్తుంది. అంటే భవనాల మధ్య ఒక ప్రదేశం అని చెపుతారు. అంటే ఇది ఇండియా మరియు పాకిస్తాన్ రెండు దేశాల మధ్య కలదు. కార్గిల్ దాని బౌద్ధ ఆరామాలకు, సుందరమైన వాలీ లకు, చిన్న టవున్ల కు ప్రసిద్ధి. ఈ ప్రదేశంలో కొన్ని ప్రధాన టూరిస్ట్ ఆకర్షణలు మరియు బౌద్ధ ఆరామాలు, అంటే సాని ఆరామం, ముల్బెఖ్ ఆరామం, శార్గోలె ఆరామం వంటివి కలవు.

సాని ఆరామం సాని గ్రామం లో ప్రఖ్యాత మైన పురాతన ఆరామం. ప్రపంచం లోని బౌద్ధ మత గురువులు మార్పా, నరోపా, పద్మసంభవ వంటి వారు సందర్శించిన ప్రసిద్ధ 8 ఆరామాలలో ఇది ఒకటి. ఈ ఆరామం కుషాన్ రాజు అయిన కనిష్కుడి చే 1వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆరామంలో బౌద్ధుల పవిత్ర 108 స్తూపాలలొ ఒకదానిని ఇక్కడ ఉంచారు. 20 అడుగుల ఈ స్తూపం కానిక స్తూపం గా చెపుతారు. ఇది ఆరామం లో వెనుక ప్రాంగణంలో కలదు.

ముల్బెఖ్ ఆరామం లో లాఫింగ్ బుద్ధ లేదా, మైత్రేయ బుద్ధ, లేదా భవిష్య బుద్ధ అనే ప్రఖ్యాత విగ్రహం ఒక ప్రధాన ఆకర్షణ. ఈ ఆరామం ఒక కొండపై కలదు. దీనిలో 9 మీటర్ల పొడవైన బుద్ధుడి విగ్రహం కలదు. కొంతమంది మత ప్రచారకులు ఈ విగ్రహాన్ని తీసుకు వచ్చారని చెపుతారు.

కార్గిల్ ఉప జిల్లా అయిన జన్స్కార్ ను ప్రతి సంవత్సరం వేలాది టూరిస్టులు దర్శిస్తారు. సుమారు 8 నెలలు ఈ ప్రదేశం పూర్తి మంచు తో కప్పబడి వుండటం చే ఇక్కడకు ఎవరూ రారు. ఇంకా ఇక్కడ, కర్శా ఆరామం, జొన్గ్ఖుల్ ఆరామం, స్తంగ్ డే ఆరామం కలవు. సురు వాలీ లోని దరాంగ్ ద్రుంగ్ మంచు కొండ ఇక్కడ ఒక ప్రధాన ఆకర్షణ.

కర్శా ఆరామం చాలా పెద్దది. ఇందులో సుమారు 150 మంది బౌద్ధ సన్యాసులకు వసతి కల్పించబడింది. ఇక్కడకు చాలామంది యాత్రికులు వస్తారు. చోమో గొంప లేదా నాన్నారి కూడా ఆరామంలో కలదు. రాంగ్ డం ఆరామం, ఫూగ్ తాల్ ఆరామం, షార్ గోలే ఆరామం మరియు స్తారిమో ఆరామాలు కూడా ఈ జిల్లా లో ప్రసిద్ధి గాంచినవే.

కార్గిల్ శ్రీనగర్ సమీపం లో వుంటుంది. రోడ్ ద్వారా తేలికగా చేరవచ్చు. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ దేశంలోని ఢిల్లీ, సిమ్లా, ముంబై, చండిఘర్ వంటి నగరాలకు కలుపబడి, కార్గిల్ కు సమీపంగా వుంటుంది.

కార్గిల్ కు జమ్మూ తావి రైలు స్టేషన్ సమీపం, ఇది సుమారు 540 కి. మీ. ల దూరం. ఇక్కడ నుండి కేరళ, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ నగరాలకు చేరవచ్చు. రైలు స్టేషన్ నుండి కార్గిల్ కు టాక్సీలు, బస్సు లు కలవు. జీపులు, టాక్సీలు, కూడా నడుస్తాయి.

కార్గిల్ ప్రాంతం హిమాలయా శ్రేణులలో వుండటంచే వాతావరణం వేడిగాను, చల్లగాను కూడా వుంటుంది. వింటర్ లో అధిక మంచు రాలటం వలన మార్గం మూసి వేస్తారు. టెంపరేచర్ - 48 డిగ్రీలు వరకు పడుతుంది. అసలు సంచిరించే వీలులేదు. ఈ ప్రాంతం వేసవిలో పర్యటనకు అనుకూలం. మే మరియు జూన్ ల మధ్య కార్గిల్ లో సైట్ సీఇంగ్ బాగుంటుంది.

కార్గిల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కార్గిల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కార్గిల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కార్గిల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణం చేయాలనుకునే పర్యాటకులకు లెహ్ మరియు శ్రీనగర్ ల నుండి కార్గిల్ కు నేరు బస్సులు కలవు. శ్రీనగర్ కు జమ్మూ, చండి గర్ , ఢిల్లీ , పహల్గాం , లెహ్ లనుండి బస్సులు కలవు. టూరిస్టులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ బస్సులలో కూడా తరచుగా ప్రయాణించవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం కార్గిల్ కు సుమారు 540 కి. మీ.ల దూరంలో జమ్మూ తావి రైలు స్టేషన్ కలదు. ఈ రైలు స్టేషన్ నుండి ఇండియాలోని వివిధ ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. ఈ రైలు స్టేషన్ నుండి జీపులు, టాక్సీ ల లో కార్గిల్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ కు దగ్గర కావటం తో విమాన, రైలు, రోడ్డు మార్గాలలో తేలికగా చేరవచ్చు. విమాన ప్రయాణం కార్గిల్ కు శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ సమీపం. సుమారు 206 కి. మీ.ల దూరం వుంటుంది. ఇక్కడ నుండి ఇండియా లోని ప్రధాన నగరాలకు విమానాలు కలవు. ఎయిర్ పోర్ట్ నుండి కార్గిల్ కు టాక్సీలలో చేరవచ్చు. సమీప ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఢిల్లీ లో కలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed