Search
  • Follow NativePlanet
Share

కర్కల -  చారిత్రిక, ధార్మిక ప్రాముఖ్య౦

15

కర్ణాటక లో ఉడిపి జిల్లాలోని కర్కల అనే చిన్న పట్టణం చారిత్రిక, ధార్మిక ప్రాముఖ్య౦ వున్న ప్రదేశం.

చూసి తీరవలసిన సాంస్కృతిక వైభవం గల ప్రదేశం

కార్కల జైన రాజులు పరిపాలించిన 10 వ శతాబ్దపు చారిత్రిక మూలాలు కలిగిన ప్రదేశంగా గుర్తించబడింది. ఆ సమయంలో ఉన్న పాలకులు అనేక జైన బసదిలు, దేవాలయాలను నిర్మించారు. ఈ నిర్మాణాలు ఈరోజు పాత చరిత్ర తెలుసుకోవాలని వచ్చే యాత్రికులను ఆకర్షిస్తున్నాయి. నిజానికి, ఈ జైన విగ్రహాలు నిర్మాణాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వీటిని UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గా గుర్తించింది.

పెద్ద బాహుబలి విగ్రహ౦తో పాటు మరికొన్ని ప్రసిద్ధ నిర్మాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ పట్టణంలోని రాతి కొండలలో అమర్చబడిన 42 అడుగుల ఎత్తైన విగ్రహం కర్నాటకలోని రెండవ ఎత్తైన నిర్మాణం. ఈ విగ్రహం ముందు ఉన్న బ్రహ్మదేవ స్థంభం కూడా అసాధారణమైనది.

కర్కల లో చరిత్ర ఆనవాళ్ళున్న 18 జైన్ బసదిలు వున్నాయి. అంతేకాక, అనంతశయన, ఆదిశక్తి ఆలయాలతో సహా పలు పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ పట్టణం పులివేషం లేదా పులి నృత్యం, ఎద్దుల పందాలు వంటి సంప్రదాయాలకు ప్రజాదరణ పొందింది.

కర్కల బెంగళూర్ నించి 380 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులకు అనుసంధానించబడి ఉంది.

కార్కల జైనులకు, హిందువులకు ఒక ప్రసిద్ధ ధార్మిక ప్రదేశం. ఇక్కడ శీతాకాలం, మరీ వేడిగా కాకుండా, మరీ చల్లగా కాకుండా ఈ ప్రాంతం ఒక మోస్తరు వేసవి, శీతాకాలు కలిగి వుంటుంది. మహామస్తకాభిషెక౦ సమయంలో ఈ పట్టణం ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ పండుగకు వేలమంది జైన భక్తులు హాజరవుతారు. ఈ మహామస్తకాభిషెక మహోత్సవం మరలా 2014 లో జరుగుతుంది.

కర్కల ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కర్కల వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కర్కల

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కర్కల

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: రోడ్డు మార్గం ద్వారా కర్కల అనేక ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. కర్కల చేరుకోవడానికి బెంగళూర్, హైదరాబాద్, చెన్నై నుండి ఎన్నో విలాసవంతమైన, ప్రైవేట్ బస్సులు తరచుగా అందుబాటులో ఉన్నాయి. బస్సు ప్రయాణం సులభంగా సౌకర్యవంతంగా, అందుబాటు ధరలతో ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా: కర్కలకు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడిపి రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ అనేక ప్రధాన భారత నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    చేరుకోవడం ఎలా వాయుమార్గం, రైలు, రోడ్డు మార్గాలు పర్యాటకులు కర్కల చేరుకోవడానికి అందుబాటులో ఉన్న రావాణా సౌకర్యాలు. వాయు మార్గం: కర్కల నించి ప్రధాన భారత నగరాలకు వెళ్ళడానికి మంగలూర్ విమానాశ్రయం దగ్గరి విమానాశ్రయం. ఇంతకుమునుపు దీనిని బాజ్ పే విమానాశ్రయం అనికూడా పిలిచేవారు, ఇది కర్కల పట్టణం నించి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat