మహారాష్ట్రలోని ధానే జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 1800 అడుగుల ఎత్తున కల ఖొడాల ఒక సుందరమైన గ్రామం. ప్రశాంత వాతావరణానికి ప్రసిద్ధి గాంచిన ఖొడాల దానిలోని ఆకర్షణలు అంటే వైతరణి సరస్సు, ఇగాత్ పురి - కాసర ఘాట్ మరియు ట్రింగల్ వాడి కోటలతో ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. ఒక సుందర దృశ్యాల అద్భుతం
ఖొడాల ప్రధానంగా కొండ ప్రాంతాల మధ్య దట్టమైన ప్రదేశంలో ఉండటం చేత ట్రెక్కింగ్ మరియు విహార స్ధలంగా కూడా పరిగణించబడుతుంది. ఖొడాల చాలా సాంప్రదాయక వాతావరణం కలిగి ప్రశాంతమైన అటవీ ప్రదేశంలో పర్యాటకుల వినోద విహారాలకు సిద్ధంగా ఉన్నట్లనిపిస్తుంది.
ముంబై మరియు పూనేల వంటి నగరాల పక్కనే ఉన్నప్పటికి ఖొడాల బాగా పేరుపడలేకపోయింది. ఈ ప్రదేశం చాలావరకు స్ధానిక గిరిజనుల సంస్కృతి కలిగి ఉంటుంది. నేటికి ఇక్కడి ప్రజలు జంతు సంబంధిత ఆచారాలు ఆచరిస్తారు. నేడు మనమంతా ఆధారపడే ఆధునిక సాంకేతికతలు వీరికి ఏ మాత్రం చేరలేదు.
నేటికి గిరిజనుల జానపదాలు, సంగీత నాట్యాలు, దుస్తులు వంటివి ప్రకృతికి సమీపంగా ఉంటాయి.
ప్రధాన ఆకర్షణలు
ఖొడాల ట్రెక్కర్లకు ఆకర్షణీయ స్ధలం. ట్రెక్కింగ్, మౌంటెన్ బైకింగ్, కొండలను తాళ్ళతో అధిరోహించడం వంటి సాహస చర్యలు చేయాలనుకునేవారికి ఒక మంచి ప్రదేశం. ఇక్కడకల అమల వైల్డ్ లైఫ్ శాంక్చురీ దాని వివిధ సరీనృప సమూహాలతో ప్రకృతి ప్రియులను ఉత్సాహపరుస్తుంది. శాంక్చురీలో కల వివిధ మొక్కలు, వృక్షాలు ఎంతో అందంగా కనపడుతూ వలస పక్షులను ఆకర్షిస్తూంటాయి. ఖొడాల సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగానే ఉన్నప్పటికి శీతాకాల సమయం సందర్శనకు అనుకూలమైనది. గిరిజనుల నాట్యాలను చూడాలంటే వారి పండుగల సమయంలో సందర్శన మరింత బాగుంటుంది.
ఖొడాల చేరాలంటే, వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు అనుకూలం. ఖొడాలకు సమీపంలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని అన్ని నగరాలకు, మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలకు విమాన ప్రయాణాలకు అనుకూలం. రైలు ప్రయాణంలో ఖొడాల చేరాలనుకునేవారికి ఇగాత్ పురి రైలు స్టేషన్ దీనికి 30 కి.మీ.ల దూరంలో ఉంటుంది. అయితే, మీరు కనుక 450 కి.మీ.ల నుండి 500 కి.మీ.ల దూరంలో ఉండే వారై స్వంత వాహనంలో ప్రయాణించాలనుకుంటే, అది మరింత ఆనందాన్నిస్తుంది.



Click it and Unblock the Notifications