నట్టకం అనే గ్రామం కొట్టాయంలోని పల్లం తాలూకాలో ఉంది. కొట్టాయం నగరానికి నట్టకం 6.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ గ్రామం చుట్టూ పచ్చదనం తో ఉండుట వల్ల అత్యద్భుతమైన అందాన్ని కలిగి ఉంటుంది.వేసవి కాలంలో అనేక రకాల వలస పక్షులు వస్తాయి.ఈ పక్షుల అరుపులు ఒక సంగీత వాతావరణాన్ని కలిగిస్తాయి.
కొట్టాయం పోర్ట్ మరియు కంటైనర్ టెర్మినల్ (KPCT) నట్టకంలో ఉన్నాయి.మీరు ఒకసారి తప్పకుండా నట్టకంను సందర్శించండి.ఇక్కడ ఆయుర్వేద మసాజ్ మరియు ఈత, ఫిషింగ్ మరియు బోటింగ్ వంటి ఇతర వినోదాలు కూడా ఉన్నాయి.మీకు ఫోటోగ్రఫి మీద ఆసక్తి ఉంటే సందర్శించడానికి ఇది ఒక మంచి ప్రదేశం.



Click it and Unblock the Notifications