కోవలం లోని మూడు ప్రసిద్ధ బీచ్ లలో సముద్రా బీచ్ ఒకటి. ఈ సముద్రా బీచ్ కోవలం తీరప్రాంత ఉత్తర భాగంలో ఉంది, ఇది మిగిలిన రెండు బీచ్ ల లాగా ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షించ లేదు. ఇది ఉత్తర, దక్షిణ తీర రేఖల పర్వత పంక్తులపై ఉండడమే ప్రధాన కారణం. ఇక్కడ పెద్ద పర్యాటక జనాభా లేకపోవడం వల్ల, స్థానిక జాలర్లు ఈ తీరప్రాంతంలో చేపలు పడతారు. అయితే, మీరు తీరం లోని ఈ వైపు నీటిలోకి దూకే సాహసం చేసేట్లయితే రాళ్ళకు కొట్టుకునేలా ఎగసి పడి మళ్ళీ వెనక్కి తగ్గే సౌమ్యమైన అలలను ఇక్కడ చూడవచ్చు. ఈ తీరం వెంట ఒక గోడ వుంది – దాని పైన కూర్చుని అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఈ తీరం నిండా కొబ్బరి, తాటి చెట్లు వుండి దీనికి ఒక పచ్చదనాన్ని తీసుకువచ్చాయి.సముద్రా బీచ్ కి దగ్గరగా ఉన్న అశోక బీచ్ అంతగా ప్రసిద్ది చెందలేదు.