ఈ ప్రదేశంలో అనుభవించిన అనేక చారిత్రిక మార్పులకు కోవలంలోని ఈ దీపస్తంభం ఒక నిశ్శబ్ద సాక్షి. ఈ లైట్ హౌస్ ని విజింహం లైట్ హౌస్ లేదా విలింజం లైట్ హౌస్ అని కూడా పిలుస్తారు. విస్తారమైన అరేబియన్ సముద్రం చూసి సరదాగా చాయా చిత్రాలు తీయడానికి పర్యాటకులు ఈ లైట్ హౌస్ ఎక్కడానికి ఇష్టపడతారు. నిజానికి, దేశం మొత్తంలో ఎక్కువగా సందర్శించ బడే లైట్ హౌస్ ఇదే. అందువల్లే లైట్ హౌస్ కి దగ్గరా వున్న ఈ బీచ్ కి లైట్ హౌస్ బీచ్ గా అనే పేరుంది. ఎరుపు, తెలుపు బ్యాండ్ల రంగు రాళ్ళతో నిర్మించబడిన ఈ లైట్ హౌస్ 118 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ఇప్పటకీ పని చేస్తూ నౌకలు సముద్రం లో ప్రయాణించడానికి చుక్కానిలాగా మార్గదర్శకంగా ఉంది. మేస్సర్స్ బిబిటి ఇచ్చిన సాధనాలతో అమర్చిన లైట్ హౌస్ 1972 లో తిరిగి 2003 లో పునర్నిర్మించబడింది. లైట్ హౌస్ పైనుండి కోవలం బీచ్ ని ప్రత్యేకమైన మూడు గట్లుగా స్పష్టంగా గమనించ వచ్చు.