వెల్లాయని సరస్సు, కోవలం

హోమ్ » ప్రదేశములు » కోవలం » ఆకర్షణలు » వెల్లాయని సరస్సు

తిరువనంతపురం జిల్లా గుండా ప్రవహించే ఈ వెల్లాయని సరస్సు ఈ జిల్లాలోని అతి పెద్ద మంచినీటి సరస్సు. స్థానికులు దీన్ని ‘వెల్లాయని కాయల్’ అని వ్యవహరిస్తారు. తిరువనంతపురం ప్రధాన బస్సు కూడలి నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో వుండడం వల్ల ఈ సరస్సు స్థానికులు, యాత్రికులు విరివిగా సందర్శించే విహార కేంద్రాల్లో ఒకటి. మీరు కోవలం వెళ్తే ఒక్కసారైనా ఈ సరస్సును చూడాల్సిందే.తాజాగా ఉండే స్వచ్చమైన నీలిరంగు నీళ్ళతో ఈ సరస్సు చాలా అందంగా కనపడుతుంది. ఈ సరస్సు మీద వెన్నెల పడగానే ఈ ప్రాంతం అంతా స్వర్గతుల్యంగా మారిపోతుంది. ఈ దృశ్యాన్ని చూడడానికి యాత్రికులు రాత్రిదాకా వేచి ఉంటారు. ఈ సరస్సులో ప్రతి ఏటా ఓనం పండుగ సందర్భంగా పడవ పందాలు జరుగుతాయి. వీటిని చూడడానికి చాలామంది వస్తారు. ఓనం అపుడు మీరు కోవలం లో గానీ చుట్టుపక్కల గానీ ఉంటె తప్పకుండా పడవల పందాలు చూడండి.

Please Wait while comments are loading...