కక్కయం కాలికట్ నగరం నుండి 45 కిమీ దూరంలో ఉన్న ఒక సుందరమైన ఆనకట్ట. పర్యాటకులను మరియు ప్రయాణీకులను ఆకర్షిస్తుంది. రాక్ అధిరోహణ మరియు ట్రెక్కింగ్ వంటి సాహస కార్యక్రమాలు కక్కయం లో నిర్వహిస్తారు.పశ్చిమ కనుమలు వెంట ఈ ప్రదేశం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉంది.ఇక్కడ వృక్ష మరియు జంతు జాతులు చాల ఉన్నాయి.ఈ ప్రాంతంలో అద్భుతమైన ట్రెక్కింగ్ ట్రయల్స్ ఉన్నాయి, మరియు అటవీ పోలీసు యంత్రాంగం పరిధిలో ఉన్నాయి. కక్కయం రిజర్వాయర్ విహారయాత్రలు మరియు సాహస ఔత్సాహికులను ఆకర్షించే ప్రదేశం.పర్యాటకులకు సుందరమైన దృశ్యం, మరియు కుటుంబ ప్రయాణాలు, సాహస ప్రయాణాలు పిక్నిక్ లకు అనువైన స్థలం. మనసుకు ఆహ్లాదకరముగా ఉంటుంది.కాలికట్ నుండి రోడ్డు ద్వారా కక్కయం చేరుకోవచ్చు..కాలికట్ నగరంలో బస్ లు బయలుదేరే బస్ స్టాండ్ ను మోఫుసిల్ బస్ స్టాండ్ అని పిలుస్తారు.ఇక్కడ బస్సులు ఎక్కువగా ఉంటాయి.పర్యాటకులు ఈ ప్రదేశంను చేరుకోవడానికి నగరం నుండి ఒక ప్రైవేట్ టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు.