వేంకటాచలపతి స్వామి టెంపుల్ కుంబకోణం టవున్ నుండి 7 కి.మీ.ల దూరంలో కలదు. దీనిలో విష్ణు మూర్తి, లక్ష్మి దేవిల విగ్రహాలు వుంటాయి. ఇక్కడి విష్ణు మూర్తిని వేంకటాచలపతి గాను, లక్ష్మి దేవిని భూదేవి గా పూజిస్తారు.
దేవాలయ శిల్పశైలి అద్భుతంగా వుంటుంది. ఎత్తైన గోపురాలు, విశాలమైన ఆవరణ ముగ్ధులను చేస్తాయి. వేదాలలోని అనేక విషయాలను గోడలు, సీలింగ్, గోపురం లపై వ్రాసారు. వీటి నుండి పర్యాటకులు హిందువుల మత విశేషాలు అనేకం తెలుసుకోవచ్చు. ఈ హిందూ శాస్త్రాలు చదివి విజ్ఞానం పెంపొందించుకోవ దానికి అనేకులు ఇక్కడకు వస్తారు. ఈ టెంపుల్ లో ఉప్పు వేసి చేసిన వంటకాలు విష్ణుమూర్తికి నిషేధం.



Click it and Unblock the Notifications