పర్యాటకులు ఈ ప్రాంతంలోనే వెంకటరమణ దేవాలయాన్ని కూడా దర్శించవచ్చు. ఈ దేవాలయంలో వెంకటరమణ మరియు గోపాలక్రిష్ణ విగ్రహాలు ప్రధానంగా ఉంటాయి. సత్యభామ, లక్ష్మీ మరియు ముఖ్య ప్రాణ్ దేవ్ ల విగ్రహాలు కూడా కలవు. ఈ దేవాలయంలో ఫిబ్రవరి నెలలో రధోత్సవం మరియు మే నెలలో వ్యవస్ధాపక దినోత్సవం వేడుకలు ప్రధానంగా జరుపుతారు. కార్తీక మాస ఉత్సవాలు, చంపషష్టి ఉత్సవం, సప్తప్రహార్ భజన్, రధోత్సవం, ఉగాది, ముక్కోటి ద్వాదశి, అక్షయ త్రితీయ, అనంత వ్రిత్త మరియు రామనవమి పండుగల వేడుకలు కూడా దేవాలయంలో జరుగుతాయి.
ఈ దేవాలయ పాలన శ్రీ సంస్ధాన్ గోకర్ణ పర్తగలి జీవోత్తమ్ మఠ్ నిర్వహిస్తుంది. గౌడా సరస్వత్ బ్రాహ్మణులకు ఈ దేవాలయం ఒక ఆధ్యాత్మిక, మత మరియు సామాజిక కార్యకలాపాల నిర్వహణకు ఒక కేంద్రంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications