పేరు సూచిస్తున్నట్టుగా బిర్లా వంశానికి చెందిన కీర్తి శేషులు జుగా బిర్లా 1952 లో బిర్లా మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ బిర్లా మందిర్ వెలిసిన చాలా కాలానికి ఈ పాత దేవాలయాలను బాగు చేసి, కొత్త పర్యాటక కేంద్రాలు నిర్మించారు.
అందువల్ల, స్థాపించిన నాటి నుంచి చాలా కాలం పాటు ఇదే కురుక్షేత్రంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణగా వుండేది. కురుక్షేత్ర- థానేసర్ మార్గంలో పాత నగరం శివార్లలో బ్రహ్మ సరోవరానికి దగ్గరలో, రైల్వే స్టేషన్ నుంచి కేవలం 2 ½ కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించారు.
స్వచ్చమైన పాలరాతితో నిర్మించిన బిర్లా మందిర్ వెనుక భాగంలో పచ్చటి తోట కూడా వుంది. ప్రధాన ఆలయంలో – మహాభారత యుద్ధ క్షేత్రంలో శ్రీ కృష్ణుడు గుర్రాలు పూన్చిన రథంపై వుండి నేలపై కైమోడ్చి కూర్చుని వున్న విషాద వదనుడై శ్రద్ధగా వింటున్న అర్జునుడికి గీతోపదేశం చేస్తూ వున్న విగ్రహం వుంటుంది.
శ్రీ కృష్ణుడు గీతోపదేశం చేసిన ఖచ్చితమైన ప్రదేశం అయిన థానేసర్ లో ఇప్పటికే వున్న ప్రపంచ ప్రసిద్ధ అసలు విగ్రహానికి ఇది ప్రతిరూపం,
ఈ గుడిలో గురునానక్, గురు గోబింద్ సింగ్, గురు తేజ్ బహదూర్, సంత్ రవి దాస్, శ్రీ కృష్ణుడు, హనుమంతుడు, రాముడు వంటి దేవతలు, యోగుల విగ్రహాలు, వాటి కింద వారి బోధలు చెక్కి వున్నాయి.



Click it and Unblock the Notifications