ధరోహర్ హర్యానా మ్యూజియం హర్యాన్వీ జానపద సంస్కృతి వారసత్వాలకు నిలయం. ఈ కేంద్రం ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులను ఆకర్షిస్తుంది. జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియా, నార్వే, రష్యా, చిలీ, మలేషియా, మారిషస్, డెన్మార్క్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా లాంటి దేశాలనుంచి ఇప్పటి దాకా ఇది 6 లక్షలకు పైగా యాత్రికులను చూసింది. ఈ కేంద్రంలో 3000 కు పైబడి అరుదైన, పురాతనమైన వస్తువులు వున్నాయి. పర్యాటకులనే కాక స్థానిక జానపద సంస్కృతి, వారసత్వం, సాహిత్యం, నిర్మాణం, సంగీతం, సంప్రదాయాలు, కట్టుబాట్లు, పురావస్తు విషయాలు, విద్య, ఆర్ధిక రంగం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, ప్రజా పరిపాలన శాస్త్రం వగైరాల్లో పరిశోధకులను కూడా స్వాగతిస్తోంది.



Click it and Unblock the Notifications