పురాతన బౌద్ధ లిపులలో దీనిని ముకుట్ బంధన్ -చైత్య లేదా ముక్తా-బంధన్ విహార్ అని పిలిచేవారు. రంభర్ స్థూపం, నిర్వాణ ఆలయానికి ఆగ్నేయంలో సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.ఈ స్థూపం ఉన్న స్థలాన్నిప్రపంచం నలుమూలల నుండి బౌద్ధ యాత్రికులు అధిక పూజ్యనీయంగా భావిస్తారు. 483 BC లో బుద్ధుడు మరణించిన తర్వాత సరిగ్గా ఈ స్థానంలోనే అతని
భౌతికకాయాన్ని దహనం చేశారని ఒక నమ్మకం.బౌద్ధ గ్రంథాల ప్రకారం ఈ స్థూపం బుద్దుడి యొక్క జీవితకాలంలో కుషినగర్ పాలించిన మల్ల రాజుల చేత నిర్మించబడింది. దీని ఆకృతి యొక్క నమూనా దాని పురాతన చారిత్రిక పాత్రకు సాక్ష్యంగా నిలిచింది.
ఈ స్థూపం కుషినగర్-డెఒరియా రహదారి ఎదురుగా ఉన్న ఒక దిబ్బ మీద నిర్మించబడింది. ఇది ఇటుకలతో నిర్మించబడింది. ఈ స్థూపం 47,24 మీటర్ల వృత్తాకార ఆధారంగా, 14.9 మీటర్ల ఎత్తు పెరిగింది. డ్రమ్ లాంటి దాని అగ్రభాగం 34,14 మీటర్ల వ్యాసం కలిగి ఉన్నది. ఈ స్థూపం, వరి, చెరకు మరియు గోధుమ పొలాలు కలిగిన వ్యవసాయ భూమిపై ఉన్నది. దీనికి సమీపంలో చెరువులాగా నీటి మడుగు ఉన్నది.



Click it and Unblock the Notifications