దిగంబర్ జైన్ బారా దేవాలయం ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఈ దేవాలయంలో అందమైన జైన తీర్ధంకరుల విగ్రహాలుంటాయి. స్తంభాలు చక్కని శిల్ప శైలి, అరుదైన కళలు కలిగి ఉంటాయి. ఇక్కడ పురాతన జైన తాళపత్రగంధాలు కూడా కలవు. ఈ దేవాలయాన్ని ఆషాఢ శుక్ల 8, 1136 సంవత్సరంలో నిర్మించారు.
ఈ దేవాలయంలో రెండు వేదిక గదులు కూడా కలవు. వీటిలో పర్యాటకులు రెండవ తీర్ధంకరుడు అజిత్ నాధ్ జీ మరియు 16వ తీర్ధంకరుడు శాంతినాధ జీ ల విగ్రహాలను చూడవచ్చు. ఈ రెండు విగ్రహాల ముందర, కళాత్మకమైన రెండు పెద్ద ద్వారాలను కూడా చూడవచ్చు. దేవాలయంలో ఒక ఆర్ట్ గ్యాలరీ కలదు. దీనిలో వివిధ జైన తీర్ధంకరుల కు చెందిన సుమారు 166 మార్బుల్ విగ్రహాలు కలవు. పాలరాయి విగ్రహాలే కాక, పర్యాటకులు అనేక ఇతర మెటల్ విగ్రహాలను కూడా చూడవచ్చు.



Click it and Unblock the Notifications