Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లాన్స్ డౌన్ » ఆకర్షణలు » కణ్వాశ్రం

కణ్వాశ్రం, లాన్స్ డౌన్

1

కణ్వాశ్రం పచ్చని అడవులు మరియు చిన్నకొండల మధ్య నెలకొని ఉన్న లాన్స్ డౌన్ యొక్క ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. ఆశ్రమం దగ్గరగా ప్రవహించే మాలిని నది ఈ ప్రాంత సౌందర్యాన్ని మరింత పెంచుతుంది. ఆశ్రమం సరైన వసతి సౌకర్యాలతో కూడిన ఆదర్శవంతమైన ధ్యాన ప్రదేశం. సహస్రధరా జలపాతం కూడా కణ్వాశ్రం సమీపంలో ఉంది.

ఒక పురాణం ప్రకారం, ప్రముఖ మహర్షి, విశ్వామిత్రుడు ఒకసారి ఇక్కడ ధ్యానం చేసాడు. కథ ప్రకారం, విశ్వామిత్రుని తీవ్రమైన ధ్యానం చూసి స్వర్గాధిపతి ఇంద్రుడు భయపడ్డాడు. ఆయన మహర్షి తపోభంగం కలిగించడానికి మేనక అనే స్వర్గలోక సుందరిని పంపాడు. మేనక, విశ్వామిత్రుని దృష్టిని మరల్చడంలో విజయం సాధించింది. వారి సంయోగ ఫలంగా ఒక అమ్మాయి జన్మించింది. ఆమెకు శకుంతల అనే పేరు పెట్టారు. తరువాత, మేనక ఈ ఆశ్రమంలో కణ్వ మహర్షి సంరక్షణలో పిల్లను వదిలివేసింది. శకుంతల పెరిగి, ఆ సమయంలో హస్తినాపుర పాలకుడు అయిన దుష్యంత ప్రభువును వివాహం చేసుకున్నది. కొన్ని సంవత్సరాల తరువాత, ఆమె ఒక అబ్బాయికి జన్మనిచ్చి అతనికి భరతుడు అనే పేరు పెట్టింది. భారత్ లేదా భరతవర్షం అని తరచుగా పిలవబడే భారతదేశం అతని పేరు మీదే పెట్టారని నమ్ముతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed