బేగం హజరత్ మహల్ పార్క్ ను అవధ యొక్క చివరి నవాబ్ వాజిద్ అలీ షా భార్య బేగం హజరత్ పేరు పై నిర్మించారు. ఈ నిర్మాణం సిటీ మధ్య లో హోటల్ క్లార్క్ అవధ సమీపంలో కలదు. బేగం తన భర్త కలకత్తాకు వెళ్లి పోయిన తర్వాత లక్నో సిటీ వ్యహారాలలో ఆధిపత్యం తీసుకుంది. ఆమె బ్రిటిష్ వారితో తీవ్రంగా పోరాడి చివరకు నేపాల్ లో తల దాచుకొంది. నేపాల్ లోనే 1879 లో మరణించింది.
స్వాతంత్రం తర్వాత ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు ఒక మెమోరియల్ కట్టించింది. దీనిని 1962 ఆగష్టు 15 నాడు పబ్లిక్ కు తెరచారు. ఈ స్మారకంలో రాజ కుటుంబానికి సంబంధించిన వస్తువులు వుంటాయి.
ఈ పార్క్ ఉదయాలు కాలి నడక చేసే వారికి స్వర్గంగా వుంటుంది. అందమైన లాన్ లు, కాలి నడక మార్గాలు, మార్బుల్ నిర్మాణాలు, ఫ్లడ్ లైట్ లు, కృత్రిమ కొలనులు కలిగి వుంటుంది.



Click it and Unblock the Notifications