మరావంతే వచ్చిన పర్యాటకులు ఆనెగుడ్డ వినాయక మందిరం తప్పక చూడాలి. ఇది.పట్టణానికి 21.6 కి.మీ. దూరంలో ఉంటుంది. గణేషుడు ప్రధాన దేవత. తులునాడు సప్తక్షేత్రాలలో ఇది ఒకటి. దీనినే ముక్తి స్ధల అని కూడా అంటారు. దర్శిస్తే మోక్షం వస్తుందని భావిస్తారు. ఆనె అనగా ఏనుగు, గుడ్డె అనగా కొండ అని అర్ధంగా చెపుతారు. ఇక్కడి గణపతి దేవుడి విగ్రహానికి నాలుగు చేతులుంటాయి. రెండు చేతులు కోరికలు తీర్చే వరద హస్తాలుగాను మరో రెండు చేతులు ఆయన పాదాలను చూపిస్తూ ముక్తి ప్రసాదించేవిగాను ఉంటాయి. ఇక్కడ గణేష చతుర్ధి, సంకష్ట చతుర్ధి చేస్తారు. యాత్రికులు తులాభారం కూడా ఈ దేవాలయంలో చేయవచ్చు. డిసెంబర్ నెలలో రధోత్సవం జరుగుతుంది. ఈ దేవాలయ సమీపంలో మహాలింగేశ్వర దేవాలయం కూడా ఒక మంచి ఆకర్షణగా ఉంటుంది.



Click it and Unblock the Notifications