Search
  • Follow NativePlanet
Share

మతేరన్ - ఒక అందమైన దృశ్యాల వేసవి విడిది.

31

మహారాష్ట్ర లోని మతేరన్ ఒక అద్భుతమైన, ప్రసిద్ధి చెందిన చిన్న వేసవి విడిది. కళ్ళు చెదిరే 2650 అడుగుల ఎత్తులో పశ్చిమ కనుమల లోని పర్వత శ్రేణులలోఒక చిన్న యాత్ర విశేషము. ముంబై, పూణే వంటి పెద్ద పెద్ద పట్టణాలకు  దగ్గరగా ఉండడం వల్ల వారాంతపు ఆటవిడుపుకు అనువైన ప్రదేశం. మతేరన్ అంటే తల మీది అడివి అని చెప్పుకోవచ్చు.

1850 లో దీనిని హ్యూ పోలింజ్ మలేట్ కనుగొన్నాడని చరిత్ర వల్ల తెలుస్తోంది. ఒక రోజు వేటాడుతూ అతను ఆకస్మికంగా ఈ ప్రదేశాన్ని కనుగొన్నాడు. అప్పటి నుండి బ్రిటిషువారు, పంచాగ్ని లాగానే దీన్ని కూడా తర్వాత వేసవి విడిదిగా మార్చివేసారు.

మతేరన్ లో వు౦డే అనేక  ఆకర్షణలు

అన్ని పర్వత కేంద్రాల్లాగే, మతేరన్ లో కూడా పరిసరాల్లోని ఆకట్టుకునే ప్రాకృతిక దృశ్యాలను అందించే చాలా ప్రదేశాలున్నాయి. 38 అధికారిక పాయింట్ లలోకీ, పనోరమా పాయింట్ నుంచి 360 డిగ్రీల కోణంలో చుట్టూ వున్న ప్రదేశాన్ని చూడవచ్చు. ఇక్కడి అధివాస్తవిక సూర్యోదయ, సూర్యాస్తమయాలను ఎవరైనా ఇష్ట పడతారు. హార్ట్ పాయింట్ నుండి ముంబై నగరం రాత్రి పూట విద్యుత్తు దీపాల మిలమిలలతో ఎంతో మనోహరంగా కనబడుతుంది.

మరొక ప్రసిద్ధమైన లూఇసా పాయింట్ నుండి చారిత్రిక ప్రాబల్ కోట చాల స్పష్టంగా కనబడుతుంది. ఒకప్పటి గంభీరమైన బలమైన ఈ కోట ప్రస్తుతం శిధిలావస్థలో ఉంది. కొన్ని ప్రసిద్ధి చెందిన ఇతర కేంద్రాలు మంకి పాయింట్, పార్క్యుపైన్ పాయింట్, ఒన్ ట్రీ హిల్ పాయింట్. మతేరన్  పురాతన బ్రిటీషు వాస్తు సౌందర్యానికి ప్రతికయైన అనేక భవనాలు కట్టడాలను కల్గిఉంది. వీనిలో అనేక కట్టడాలను చారిత్రక వారసత్వ చిహ్నాలుగా ప్రకటించారు.

చార్లట్ సరస్సు ఒక ప్రసిద్ధ విహార కేంద్రం. పక్షులను తిలకించడం, ప్రియతములతో ఒడ్డున నడవడం లేదా పిల్లలతో తొటలో కాలక్షేపం చేయడం వంటివి చేయవచ్చు. ఇక్కడికి వెళ్ళినప్పుడు పురాతన పిసర్నాథ్ దేవాలయాన్ని సందర్శించడం మరువకండి. మొర్బే జలాశయాన్ని తప్పనిసరిగా చూడండి.

మతేరన్ – ప్రకృతిలోని  స్వర్గం

మతేరన్ లో అడవి చాల దట్టంగా ఉండి కొన్ని ప్రదేశాలలో చొరబడటానికి వీలుపడదు. కోతులు స్వేచ్ఛగా విహరించడం యాత్రికులకు ఆశ్చర్యం కలిగించే అంశం. కోతులు లాక్కొని వెళ్తాయని సాధారణంగా ప్లాస్టిక్ వస్తువులను తీసుకొని రావడాన్ని నిషేదించారు. ఇది మీకు హేచ్చరికే.

మతేరన్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో ఎలాంటి వాహనాలను అనుమతించని అతి కొద్ది ప్రదేశాలలో ఇది ఒకటి.  ఇది పర్యావరణం వల్ల ప్రభావితమై, ఎలాంటి వాహనాలు లేని సమయంలో ప్రపంచం ఎలా ఉండేదన్న దృశ్యం కళ్ళకు కడుతుంది. వాహనాలు లేకుంటే కాలుష్యం తక్కువ, శబ్దాలు తక్కువ. ఫలితంగా వేలాదిమంది యాత్రికులు ప్రతిరోజు ఈ చిన్న కొండ ప్రాంతం సందర్శించినప్పటికీ దీని రమణీయ ప్రశాంతతకు  ముప్పు రాదు. అందుకే గుర్రపుస్వారీ యాత్రికులకు తప్పించుకోలేని తప్పనిసరి పసందైన కార్యక్రమంగా మారింది. చేతితో నడిపే బండ్లు కూడ ఉన్నాయి. అనుమతించబడే ఒకేఒక్క వాహనం అంబులెన్స్.

మతేరన్ లోని పలు దుకాణాల్లో కళాకృతులతో పాటు మీరు స్మారకంగా ఇంటికి తీసుకు వెళ్ళడానికి అనేక చిన్న వస్తువులు దొరుకుతాయి.

మతేరన్ పర్వత ప్రాంతం కావడంతో వేసవికాలపు సూర్యుని ప్రతాపం పనిచేయదు. ఏడాది పొడవున చల్లగా ఉండి  స్వచ్చమైన చల్లని రాత్రిని కల్గి ఉంటుంది. తరచుగా వచ్చే యాత్రికులు వర్షాకాలంలో మైమరపించే ఈ ప్రాంత అందాన్ని కొనియాడతారు. చుట్టూ పచ్చదనం, పై నుండి దుమికే జలపాతం పూర్తిగా మైమరపించే అనుభూతి. ఈ కనుమలలో ఘాట్ రోడ్డు దాకా కారు ప్రయాణం కూడ ఎంతో మరిచిపోలేని మధురానుభూతిని మిగులుస్తుంది.

భారతదేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల నుండి మతేరన్ సులభంగా చేరుకోవచ్చు. మీరు వాయు, రైలు, రోడ్డు మార్గాల గుండా ఈ ప్రాంతం అనుసంధానించబడింది. నేరాల్ నుంచి రైల్ ద్వారా మతేరన్ చాల దగ్గర.  ఈ ప్రయాణం మీకు గగుర్పాటును కలిగిస్తుంది. వాయుమార్గంలో వెళ్ళాలనుకుంటే పూణే దగ్గర లోని విమానాశ్రయం, ఇక్కడి నుంచి కొండ ఎక్కవచ్చు. అన్నింటికంటే ఉత్తమమైన మార్గం ఈ ప్రాంతం వరకు రోడ్ ద్వారా ప్రయాణించడం. కానీ అలవాటు లేని వాహనచోదకులు కొండ ప్రాంత౦ కాబట్టి చాలా జాగ్రత్తగా మెలగాలి – ప్రత్యేకంగా వర్షాకాలంలో

నగరాలలోని గందరగోళం, నిత్యం ఉండే పని ఒత్తిడి, ట్రాఫిక్ లేదా కాలుష్యాల నుండి దూరంగా ఉండాలనుకుంటే మతెరన్ ప్రతి యాత్రికుని అవసరాన్ని తీరుస్తుంది. ఈ వేసవి విడిది మిమ్మల్ని పదేపదే ఆహ్వానిస్తుంది.

మతేరన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మతేరన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మతేరన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మతేరన్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం మహారాష్ట్ర లోని అన్ని ప్రధాన పట్టణాల నుండి మతేరన్ కు ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు కలవు. సాధారణ బస్సుల కంటే డిలక్స్ బస్సు, లగ్జరీ బస్సు చార్జీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందమైన దృశ్యాల నేపధ్యంలో రోడ్డు ప్రయాణం కనులపండువగా వుంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం మతేరన్ నుండి సుమారు 11 కి.మీ.ల దూరంలో నేరాల్ రైల్వే స్టేషన్ అతి దగ్గరగా ఉంది. నేరాల్ కూడలి చత్రపతి శివాజీ టెర్మినల్ నకు కలపబడి౦ది. నేరాల్ నుండి మతేరన్ వరకు ఛార్జీలు రూ. 400. ఒక చిన్న రైలు ద్వారా నేరాల్ మరియు మతేరన్ ప్రధాన బజారు కలపబడ్డాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అతి చేరువలో కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. టాక్సీ చార్జీ సుమారుగా రూపాయలు 2000 ఉంటుంది. 130 కిలోమీటర్ల దూరంలో వున్న పూణే మరొక మార్గం .
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed