నామ యోగ సాధన మందిర్ ను స్వామీ జై గురుదేవ్ కొరకు నిర్మించారు. ఈయన శాకాహారం, చెడు గుణాలు వదలుకొని మంచి పనులు చేయాలని, అహంకారాన్ని వదలాలని బోధనలు చేస్తాడు. దీని గోపురాలు, స్తంభాలు అంతా హిందూ శిల్ప శైలి కలిగి వుంటాయి. ఈ టెంపుల్ లో ప్రతి ఏటా భండారా ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ లో తయారు చేసిన ఆహారాన్ని దేముడికి నైవేద్యం చేసి, యాత్రికులకు, పేదలకు పంచుతారు. ఈ మందిరం పేదల అభివృద్ధికి పాటు పడుతూ, వారికి వైద్య సహాయం అందిస్తుంది. ఒక స్కూల్ కూడా నడుపుతుంది. ఫీజులు వసూలు చేయదు.



Click it and Unblock the Notifications