ఇక్కడ కల సుమారు 25 ఘాట్ ల లోను విశ్రాం ఘాట్ ప్రదానమైనది. తన మేనమామ కంసుడిని వధించిన తరవాత శ్రీకృష్ణుడు ఇక్కడ విస్రమించాడని చెపుతారు. విశ్రాం ఘాట్ మరియు దాని చుట్టపక్కల ప్రసిద్ధ గుడులు కలవు. ఉదయం, సాయంత్రం హారతులు ఇచ్చే దృశ్యం అబ్బుర పరుస్తుంది. దేశ వ్యాప్తంగా భక్తులు వచ్చి శ్రీకృష్ణుడికి పూజలు చేసి స్వీట్ లు ప్రసాదంగా పంచుతారు.
ఈ విశ్రాం ఘాట్ ను అనేక మార్లు మొగలుల దాడులలో పడగొట్టగా తిరిగి నిర్మించారు. సికందర్ లోడి కాలంలో ఇద్దరు వైష్ణవ ఋషులు ఈ ఘాట్ మరమ్మతులు నిర్వహించారు.



Click it and Unblock the Notifications