జైరాంపూర్ పట్టణం, అరుణాచల్ ప్రదేశ్ ఆగ్నేయభాగంవద్ద చగ్లంగ్ జిల్లలో ఉంది. ఈ పట్టణం ఛంగ్లంగ్ జిల్లాకు ఏడిసి ప్రధానకార్యాలయం. ఇండో-మయన్మార్ సరిహద్దు తోపాటు, నమ్చిక్ బేసిన్, జైరంపూర్ లో సతతహరిత ఉష్ణమండల అడవులు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. కొండ ప్రాంతం వద్ద ఉన్న జైరంపూర్ లో సందర్శకులు ప్రకృతి నిజమైన అందాన్ని చూడవచ్చు, హోలోక్ గిబ్బంల అరుపులతో మేల్కొని, పరుచుకున్న పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు.
జైరామ్పూర్ పట్టణంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి, ఈ చిన్న పట్టణం లోని ప్రజలు చాలా మర్యాదస్తులు. జైరాంపూర్ పట్టణంలో వాతావరణం హాయిగా, ప్రశాంతంగా ఉండడంతో పర్యాటకులు ఇక్కడ కొద్దిసేపు సేద తీరవచ్చు.
2001 జనాభా లెక్కల ప్రకారం జైరాంపూర్ లో 5918 మంది ఉండగా ఇక్కడి అక్షరాస్యత 71% గా నమోదైంది. ఇది 59.5% జాతీయ సగటుకన్నా చాలా ఎక్కువ. జైరాంపూర్ లో ఉండే ప్రధానమైన తెగ తాన్గాస్ కాగా దీనిలో చాలా ఉప-జాతులు ఉన్నాయి. కష్టించి పనిచేసే ఈ గిరిజనులు చాలా సహృదయులు.
వ్యవసాయం ప్రధాన వృత్తిగా గల చాలామంది ఇటీవల క్రైస్తవంలోకి, బౌద్ధం లోకి మారిపోయారు.



Click it and Unblock the Notifications