మహాభారతంలో విదురుడు అత్యంత గౌరవించదగ్గ వ్యక్తిత్వ౦కలవాడు ఎందుకంటే, ఆయన సాధుస్వభావం, నిజాయితీ, పక్షపాత రహిత లక్షణాలను ప్రదర్శించేవాడు. ఆయన మహాభారత యుద్ధం మొదలైన తరువాత, స్త్రీలు, పిల్లల రక్షణ కోసం యుద్ధం చేస్తున్న కౌరవులు, పాండవులు ఇద్దరినీ అభ్యర్ధించాడు కాబట్టి ఆయన యుద్ధంలో చనిపోలేదు అని చెప్తారు.
తను తన స్వంత ఇంట్లో వారందరికీ వసతులు కల్పించలేదు కాబట్టి, వారి రక్షణ కోసం వేరొక రక్షణ నిలయాన్ని నిర్మించాడు. దీనినే విదుర్ కుతీర్ లేదా ఒక ఆశ్రమం అంటారు. దుర్యోధనుడికి, ఆయనకు విభేదాలు వచ్చిన తరువాత, ఆయన తన శేష జీవితాన్ని ఈ కుటీరంలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. విదురుని తీక్షణ బుద్ధికి మంత్రముగ్ధుడై శ్రీకృష్ణుడు విదురుని కుటీరాన్ని సందర్శించి పావనం చేసాడని నమ్మకం.
ఈ కుతీర్ బిజ్నోర్ నుండి షుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో, పస్తుతం దరనగర్ అని పిలువబడే ప్రదేశం వద్ద ఉత్తరప్రదేశ్ జిల్లా మొరాదాబాద్ లో ఉంది.



Click it and Unblock the Notifications