మౌంట్ అబూ లో గల ది బ్రహ్మ కుమరీస్ స్పిరిట్యువల్ యూనివర్సిటీ ప్రపంచ ప్రసిద్ధ సామాజిక అధ్యాత్మిక విద్య సంస్థ. ఈ విశ్వవిద్యాలయం బ్రహ్మ కుమరీస్ వాల్డ్ స్పిరిట్యువల్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో నడుస్తోంది. దీనిని సార్వత్రిక శాంతి, సోదర భావాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశ్యంతో1936 లో ఏర్పాటు చేశారు. ధ్యానం, యోగ, ఆధ్యాత్మిక వంటి అనేక విద్యలను ఈ విశ్వవిద్యాలయం లో బోధిస్తారు. ది బ్రహ్మ కుమరీస్ స్పిరిట్యువల్ యూనివర్సిటీ 132 దేశాలలో 8500 కేంద్రాలను కల్గి ఉంది. దీనిలో ప్రపంచవ్యాప్తంగా 8,00,000 సభ్యులు ఉన్నారు.