బ్రాండెడ్ వస్తువుల షాపింగ్ పూర్తి అయిన తర్వాత ఇక మీరు బంద్రాలో వీధి షాపింగ్ మొదలుపెట్టండి. అదివరకు రోజులలో ముంబై వీధి దుకాణాల కొనుగోళ్ళ వస్తువులు ఆరు నెలలకు మించి ఉండవనేవారు. కాని నేడు, ఈ వీధి అమ్మకాల వస్తువులు కూడా ఎంతో మన్నిక కలిగి ఉంటున్నాయి.
వీధి అమ్మకం దారులు కూడా పోటీ కారణంగా మన్నికకల వస్తువులనే అమ్మజూపుతున్నారు. కనుక మీకు చవకగా దొరికే ఫుట్ వేర్, ప్రతిరోజూ ధరించగల టీ షర్టులు ఇంకా చిన్నపాటి ఇతర వస్తువులు, తక్కువ ధరల ఎలక్ట్రానిక్స్ వస్తువులు బంద్రా వీధి షాపులలో కొనవచ్చు. ఈ వీధిలో కొనుగోళ్ళకు మంచి చోటు అంటే అదతి లింకింగ్ రోడ్డు మరియు హిల్ రోడ్డు గా చెప్పాలి.



Click it and Unblock the Notifications