నల్దేరా గోల్ఫ్ కోర్సు, ప్రపంచంలోని అతి పురాతన గోల్ఫ్ కోర్సులలో ఒకటి, భారతదేశ వైస్రాయ్ కర్జన్ ప్రభువు 1920 లో నిర్మించాడు. నల్దేరా అందానికి పరవశించిన అతను తరచూ ఇక్కడ విడిది చేసిన చోటునే చివరకు గోల్ఫ్ కోర్సును నిర్మించాడు.
ప్రస్తుతం దీనిని హిమాచల్ పర్యాటక శాఖ వారు నిర్వహిస్తున్నారు. 18- రంధ్రాల గోల్ఫ్ కోర్సు తో, ఈ క్లబ్బును భారతదేశ కొండల పై ఉన్న ఎంతో ప్రాముఖ్య౦ చెందిన గోల్ఫ్ కోర్సులలో ఒకటిగా పరిగణిస్తారు. దీనికి షిమ్లా,లోని ఏ ఆర్ టి ఆర్ ఏ సి గోల్ఫ్ క్లబ్, ఢిల్లీ లోని బి ఎస్ ఎఫ్ గోల్ఫ్ క్లబ్, చండీగఢ్ లోని గోల్ఫ్ క్లబ్, ఢిల్లీ లోని ఎయిర్ ఫోర్స్ గోల్ఫ్ క్లబ్ వంటి అనేక గోల్ఫ్ క్లబ్బులతో అనుసంధానం ఉంది. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఉండే వాతావరణం పై ఈ కేంద్రం తెరిచి ఉంటుంది.



Click it and Unblock the Notifications