ఊటీ లో షాపింగ్ చాలా ఆనందం కలిగిస్తుంది. అయితే ఈ ప్రదేశానికి సంబంధించి ప్రత్యేక హస్త కళా వస్తువులు ఏమీ లేవు. ఆసక్తి కలవారు ఇతరంగా ఎన్నో వస్తువులు కొనవచ్చు. వివిధ రకాల టీ మరియు కాఫీ పౌడర్ లు దొరుకుతాయి. ఇక్కడ కల టీ ఆకులు లేదా కాఫీ గింజలు కొనక పోవటం అంటే ఒక నేరం చేసినట్లే. టీ వాసనలు అమోఘంగా వుంటాయి. ఇంకనూ హనీ, యూకలిప్టస్ , తులసి, స్ట్రా బెర్రీ, గ్రీన్ ఆపిల్ మరియు అనేక రకాల పండ్లు దొరుకుతాయి.
హోం మేడ్ చాకో లేట్ లు ఈ ప్రదేశ ప్రత్యేకత. అనేక షాపులలో డార్క్ లేదా వైట్ చాకో లేట్ లు దొరుకుతాయి. డ్రై ఫ్రూట్ చాక్లెట్లు , ఫ్లేవర్డ్ చాక్లెట్లు వంటివి ఒక ఆకర్షణ.
ఆధునికంగా వస్తున్న ఫాషన్ జ్యూయలరి మహిళలు కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేక శైలి కల ఈ ఆభరణాలు చాలా వరకు అన్ని దుకాణాలలో దొరుకుతాయి.



Click it and Unblock the Notifications