Search
 • Follow NativePlanet
Share

తలకాడు - అందరూ మరచిన దేవాలయాలు

40

తలకాడు పట్టణం ఒకప్పుడు ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. సుమారు 30 కి పైగా దేవాలయాలుండేవి. అయితే ఈ పట్టణం 16వ శతాబ్దంలో ఇసుక తిన్నెలతో కప్పబడింది. చరిత్ర ఆధారాలమేరకు ఒడయార్ల పాలనలో ఇక్కడ సహజ నాశనం జరిగింది. కాని స్ధానిక కధనాలు, ఊహాగానాలు మరో రకంగా కూడా ఉంటాయి.  ఈ ప్రాంత దేవత అయిన అలమేలు అమ్మవారి శాపం కారణంగా తలకాడు ఇసుకచే కప్పబడిందని కూడా చెపుతారు. 

తలకాడు పట్టణంలో ఒకప్పుడు అయిదు ప్రఖ్యాత శివాలయాలుండేవి. ప్రారంభంలో గంగ వంశస్ధులు, ఆ తర్వాత చోళులు ఈ ప్రాంతాన్ని పాలించారు. చోళులను హోయసల రాజు విష్ణు వర్ధనుడు తలకాడునుండి తరిమి వేశాడు. తర్వాత ఈ ప్రాంతాన్ని విజయనగర రాజులు, ఆ తర్వాత వారినుండి మైసూరు ఒడయార్లు పాలించారు.

అలమేలు అమ్మవారి నగలపై కన్ను వేసిన మైసూరు రాజు తలకాడుపై తన సైన్యంతో దాడిచేస్తాడు. ఆమె తన నగను కావేరి నదిలో పడవేసి అక్కడే ముణిగిపోయిందని, చానిపోయే ముందు తలకాడు ఇసుక దిబ్బగా మారిపోవాలని శపించిందని మాలంగి ఒక సరస్సుగాను, మైసూరు రాజులు వారసులు లేకుండా పోతారని శపించిందని స్ధానిక కధనాలు నడుస్తాయి. 16వ శతాబ్దంలో ఈ నగరం ఇసుక మేటలు వేసింది.  

స్ధానిక సంస్కృతి మరియు వారసత్వం - ఈ పట్టణం అయిదు దేవాలయాలకు ప్రసిద్ధి. అవి వైద్యనాధేశ్వర, పాతాళేశ్వర, మరుళేశ్వర, అరకేశ్వర మరియు మల్లిఖార్జుల దేవాలయాలు. ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా ఇవి ఇసుకలోకి కూరుకుపోతున్నాయి. వీటిని రక్షించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోనే విష్ణు భగవానుడి ఆలయం కీర్తినాధేశ్వర పేరుతో ఉంది. ఇది అయిదు శివాలయాలలో ఒకటి దీనిని ఇపుడు తిరిగి నిర్మిస్తున్నారు.

కావేరి నది పట్టణం గుండా ప్రవహిస్తూ ఒక చక్కటి మలుపు తీసుకుంటుంది. సీనరీలు ఎంతో రమణీయంగా ఉంటాయి. 12 సంవత్సరాలకు ఒక సారి వచ్చే పంచలింగ దర్శనం ఇక్కడ ప్రసిద్ధి. చివరి దర్శనం 2009 లో జరిగింది. ఈ పంచలింగ దర్శనం కార్తీక పౌర్ణమి రోజున రెండు నక్షత్రాలు ఖుహ యోగ మరియు విశాఖ కలసినపుడు ఏర్పడుతుంది.  

తలకాడు చుట్టుపట్ల గల సోమనాధపూర్, శివసముద్ర, మైసూర్, శ్రీ రంగపట్న, రంగని తిట్టు మరియు బండిపూర్ లు ఉన్నాయి.  

పట్టణం గురించి మరింత సమాచారం - తలకాడు సందర్శనకు నవంబరన్ మరియు మార్చి అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. తలకాడు మైసూర్ జిల్లాలో మైసూర్ కు 43 కి.మీ. దూరం మరియు బెంగుళూరు నుండి 120 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు ప్రధాన నగరాలు, పర్యాటకులకు ఎన్నో రకాల రవాణా సౌకర్యాలు కలిగిస్తాయి.

ఈ పట్టణంలో అనేక రకాల చిరుతిండ్లు, కూల్ డ్రింక్ లు కూడా విక్రయిస్తారు. అనేక హోటళ్ళు కూడా ఉన్నాయి. వసతి సౌకర్యం తేలికగా లభ్యం అవుతుంది. చరిత్ర పరిశోధించాలనుకునేవారికి తలకాడు పట్టణం ఒక మిస్టరీగా ఉంటుంది.

తలకాడు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తలకాడు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తలకాడు

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? తలకాడు

 • రోడ్డు ప్రయాణం
  బస్ ప్రయాణం మైసూర్, బెంగుళూర్ నగరాలనుండి తలకాడుకు వయా హెమ్మిగె కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ క్రమం తప్పకుండా ప్రతిరోజూ బస్ లను నడుపుతుంది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు ప్రయాణం తలకాడుకు రైలు స్టేషన్ లేదు. 49 కి.మీ. దూరంలో మైసూర్ రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడినుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైలు సదుపాయం కలదు. ఈ రైలు స్టేషన్ నుండి తలకాడుకు టాక్సీలు, బస్సులలో చేరవచ్చు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  తలకాడు ఎలా చేరాలి? విమాన ప్రయాణం - తలకాడుకు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 153 కి.మీ. దూరంలో ఉంది. దేశ విదేశ పర్యాటకులకు ఎంతో సౌకర్యం. ఇక్కడినుండి ఐరోపా, ఆసియా, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు విమానాలు నడుస్తాయి. అన్ని ప్రధాన పట్టణాలతో కలుపబడి ఉంది.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jan,Wed
Return On
20 Jan,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
19 Jan,Wed
Check Out
20 Jan,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
19 Jan,Wed
Return On
20 Jan,Thu