ఈ చర్చి బాంబోలిం గ్రామంలో ఉండటం వలన బాంబోలిం చర్చి అని పిలువబడుతోంది. ఇది ఒక పారిష్ చర్చి. దీనిని 'అవర్ లేడీ ఆఫ్ బేలెం లేదా బెధెల్ హాం ’’‘' అని కూడా అంటారు. ఇది ఒక కొత్త చర్చి. బాగా నిర్వహించబడుతోంది. ఎత్తైన సీలింగ్, తెల్లటి గొడలు ఉండి పర్యాటకులకు, యాత్రికులకు ఆ ప్రాంత నివాసులకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ చర్చి ఓర్టే డి విగార్ అనే కొండపై ఉంది. ఇది పనాజికి కొద్ది దూరం మాత్రమే. ప్రతి సంవత్సరం జనవరి మొదటి ఆదివారంనాడు అవర్ లేడీ ఆఫ్ బెధెల్ హాం పేరుపై ఒక ఫీస్టు నిర్వహిస్తారు.
నార్త్ గోవాలోని 3 ప్రధాన నగరాలనుండి బాంబోలింకు రెగ్యులర్ గా బస్సులు నడుస్తాయి. గోవా ద్వారా పాన్వేల్ కన్యాకుమారి వెళ్ళే పర్యాటకులకు హై వే నుండి కొద్ది కి.మీ.ల దూరం మాత్రమే ఉంటుంది.



Click it and Unblock the Notifications