Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పనాజి » ఆకర్షణలు » సే కేధడ్రల్ ఆఫ్ శాంతా కేటరినా

సే కేధడ్రల్ ఆఫ్ శాంతా కేటరినా, పనాజి

1

ఈ చర్చి అలెగ్జాండ్రియా కేధరిన్ కు అంకితమైంది. సె కేధడ్రల్ ఆఫ్ శాంతా కటారినా ఇండియాలోని అతి పెద్ద చర్చిగా చెప్పవచ్చు. ఈ చర్చి కి పర్యాటకులు సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటారు. ప్రత్యేకించి క్రిస్టమస్ పండుగ సందర్భంలో అధిక సంఖ్యలో వస్తారు. ఈ చర్చి పొడవు సుమారు 250 అడుగులు వెడ్లపు 181 అడుగులు ఉండి 115 అడుగుల ఎత్తున గంభీరంగా ఉంటుంది. పది అంతస్తులకంటే అధిక ఎత్తు. ఈ చర్చికి సమీపంలోనే మరో పేరు మోసిన చర్చి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి చర్చి మరియు కాన్వెంట్ కలదు. సె కేధడ్రల్ ఆఫ్ శాంతా కటారినా అంటే కేధరిన్ కు చెందిన కొన్ని ప్రఖ్యాత చర్చిల సముదాయం. వీటిలో చాలా చర్చిలు బ్రెజిల్ లో ఉన్నాయి.చరిత్రగోవాలోని ఇతర కేధడ్రల్ చర్చీల వలే కాకుండా సె కేధడ్రల్ ఆఫ్ శాంతా కటారినా చాలా పరిశుభ్రంగా నిర్వహించబడుతోంది. దీనిని పోర్చుగీసు పాలకుల విజయానికి మరియు మెఘల్ సేనలపై వారు సాధించిన విజయానికి చిహ్నంగా 1510లో రెండు టవర్లతో నిర్మించారు.  వాటిలో ఒకటి కాలక్రమేణా విధ్వంసం కాబడింది. దానిని మరల పునరుద్ధరించలేదు. కేధరీన్ ఫీస్ట్ జరిగిన రోజునే పోర్చుగీసు సైన్యాలు విజయం సాధించటంతో ఈ చర్చిని కేధరీన్ కు అంకితం చేశారు. చర్చి నిర్మాణం పూర్తయేటంతవరకు దానిలో పూజలు జరుగలేదు. చర్చి నిర్మాణం 1619లో పూర్తికాగా, దానిలో ప్రార్ధనలు 1640 నుండి మొదలయ్యాయి. చర్చి లోపల, ప్రధాన పీఠం అద్భుతంగా ఉండి కేధరిన్ ఆఫ్ అలెగ్జాండ్రియా విగ్రహం కలిగి ఉంటుంది. టవర్ చూస్తే చాలు గోవాలోని అతి పెద్ద చర్చి గంటలు  వినసొంపుగా వినపడుతూనే ఉంటాయి.   ప్రధాన ప్రార్ధనా స్ధలానికి కుడి భాగంలో క్రాస్ ఆఫ్ మిరకిల్స్ అంటే మహిమల శిలువ ఉంటుంది. ఇక్కడ  1919 లోజీసస్ క్రీస్తు ఒకసారి ప్రత్యక్షమయ్యాడని చెపుతారు. అక్కడకు ఎలా చేరాలి?సెయింట్ కేధరిన్ చర్చి పనాజిం పట్టణం నుండి కొంచె లోపలికి అంటే సుమారు 9 కి.మీ.ల దూరంలో తూర్పు భాగంలో ఉంటుంది. పనాజిం, వాస్కో డా గామా మరియు మార్గోవాలనుండి క్యాబ్ పై ప్రయాణించవచ్చు. గోవాలోని నార్త్ లేదా సౌత్ భాగాలనుండి ఈ చర్చి సందర్శనకు కొంత సమయం పడుతుంది మరియు దూరంగా ఉంది కనుక దర్శించాలంటే ఒక రోజు పడుతుంది కనుక అద్దె బైక్ లేదా స్వంత వాహనం పర్యటనకు సూచించదగినది.సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి చర్చి మరియు కాన్వెంట్  కూడా సె కేధడ్రల్ ఆఫ్ శాంతా కటరీనాకు సమీపంలో ఉంటుంది. కనుక దానిని కూడా అదే రోజు సందర్శించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat