Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పంచకుల » ఆకర్షణలు » మానస దేవి ఆలయం

మానస దేవి ఆలయం, పంచకుల

10

పంచకుల లోని మానస దేవి ఆలయం హిందువులు కోరుకునే యాత్రా స్థలాలలో ఒకటి. ఈ ఆలయం మానస దేవి లేదా శక్తి కి అంకితం చేయబడింది. 100 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఆలయం, శివాలిక్ కొండల దిగువ భాగాన ఉంది. ప్రత్యేకంగా నవరాత్ర మేళా సమయంలో దేశం మొత్తం నుండి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.  ఈ ఆలయాన్ని 1811-1815 సమయంలో గోప్ల సింగ్ మహారాజు నిర్మించారు. ఇది హిమాలయన్ ల నమ్మకానికి, సంస్కృతికి నిలుస్తుంది. హిమాలయాలు శివుడికి, శక్తికి నివాసాలుగా పరిగణిస్తారు. ఈ ఆలయమే కాకుండా పంచకుల చుట్టూ శక్తి ని పూజించే అనేక ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి.

పురావస్తు శిధిలాలు పురాతన కాలంలోని ప్రజల సాంప్రదాయ సంస్కృతిపై దృష్టిపెట్టిన ప్రాంతం నుండి తీసుకోబడ్డాయి. భారతదేశం లోని ఈ ప్రాంతంలో శక్తితత్వం ఒక ఆచారంగా పూర్తిగా సాధనచేయబడింది. మానస దేవి ఆమె పేరుని స్మరించడం వల్ల వరాలను ప్రసాదిస్తుందని భక్తులలో ప్రజాదరణ పొందింది.

నవరాత్రి ని ఈ ఆలయంలో ఎంతో అభిరుచితో, ఉత్సాహంతో జరుపుకుంటారు. భక్తులు తమ ప్రార్ధనలను అందించడం కోసం ఈ పండుగ తొమ్మిది రోజులు జరుగుతుంది. జటాయు అనే యాత్రిక ను హర్యానా పర్యాటకం వారు ఏర్పాటుచేస్తారు. శార్దియ నవరాత్రా మేళా ఆశ్విజ, చైత్ర మాసాలలో నిర్వహిస్తారు.

నవరాత్రి సమయంలో సరైన వసతులు, దర్శనం కోసం ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లను చేస్తుంది. సంవత్సరంలో ఈ సమయంలో గుడార వసతులు, పరదాలు, దుప్పట్లు, తాత్కాలిక టాయిలెట్లు, తాత్కాలిక ఆసుపత్రులు, మేళా పోలీసు పోస్ట్, లైన్లు వంటి కొన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. భక్తుల రాకపోకలు నిర్వహించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటారు. దీని పురావస్తు, పౌరాణిక ప్రాధాన్యత వల్ల కోరికలను తీర్చుకోవడానికి ఇక్కడికి గుంపులుగా వచ్చే భక్తులకు, హర్యానా ప్రభుత్వం వారు మౌళిక సదుపాయాలను, ఈ ఆలయ నిర్వహణ, యంత్రాంగాన్ని అభివృద్ది చేయడానికి కొన్ని చర్యలు తీసుకున్నారు. దీనికింద చుట్టుపక్కల భూమి, భావనలు కూడా వస్తాయి. ఇది ఈ ప్రాంత వారసత్వ స్థలాలో ఒకటిగా భద్రపరచబడింది.

ఈ ఆలయ కుడ్య చిత్రాలు ప్రధానంగా ముప్పై ఎనిమిది ఫలకాలతో అలంకరించబడి ఉంది. తోరణాలు, పైకప్పు పూల చిత్రాలతో అలంకరించబడి ఉంది. ఇది చాలా కళాత్మకం కాకపోయినా వివిధ విషయాలను ప్రతిబింబించేలా ఉంది. ప్రధాన ఆలయ నిర్మాణ గోపురాలు, మినార్లు మొఘల్ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి.

ఈ ఆలయం చండీగర్ నుండి 10 కిలోమీటర్లు, పంచకుల నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానిక బస్సులు, ఆటో రిక్షాలు రవాణాకు అనువుగా ఉన్నాయి. నవరాత్రి సమయంలో ప్రత్యెక బస్సులు నడుస్తాయి. విమానాలలో, రైల్లో ప్రయాణించే వారికి చండీగర్ గమ్యస్థానం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue