భగవతి దేవాలయం, పాతానం తిట్ట

ప్రాచీన శిల్పశైలికి భగవతి దేవాలయం ప్రసిద్ధి. ఎన్నో రకాల వాల్ పెయింటింగులు, రాతి చెక్కడాలు కనపడతాయి. పాతానం తిట్ట నుండి 9 కి.మీ. ల దూరంలోని మళయాళ ప్పుజ్జలో ఈ భగవతి దేవాలయం కలదు. ఇక్కడి అమ్మవారి విగ్రహం భద్రకాళిని పోలి ఉంటుంది. ప్రతిఏటా ఫిబ్రవరి మరియు మార్చిలలో 11 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. పట్టుస్తవం అనే పండుగను అతి వైభవంగా నిర్వహిస్తారు. శివరాత్రి ఉత్సవాలు కూడా చేస్తారు. ఉత్సవాల సమయంలో ఈ దేవాలయం తప్పక చూడదగినది.

Please Wait while comments are loading...