రాజస్ధాన్ లోని పిలానిలోని పర్యాటక ఆకర్షణలలో శారదా దేవాలయం ప్రాధాన్యమైనది. ఈ 20వ శతాబ్దపు దేవాలయంలో సరస్వతి మాత కలదు. దీనిని ఖ్యాతి కెక్కిన పారిశ్రామిక వేత్త, స్వాతంత్ర సమర యోధుడు మరియు ధార్మిక వాది అయిన జి.డి. బిర్లా నిర్మించారు.
ఈ దేవాలయం బిట్స్ పిలానిలోని ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజీ కేంపస్ విద్యా విహార్ లో కలదు. ఇది అందమైన మార్బుల్ రాతితో కట్టబడింది. ఈ మార్బుల్ ను రాజస్తాన్ లోని మాక్రణ నుండి తెప్పించారు. దేవాలయ నిర్మాణంలో ఇండో ఆర్య నిర్మాణ శైలి కనపడుతుంది ఖజురాహో లోని ఖండారియా మహాదేవ్ దేవాలయం శైలి కనపడుతుంది. దేవాలయం అయిదు భాగాలు అంటే గర్భ గ్రిహ , ప్రదక్షిణా పధ, అంతరాళ, మండపం మరియు అర్ధ మండపాలను కలిగి ఉంటుంది.
దేవాలయం నిర్మాణంలో సైన్స్ మరియు ఆధ్యాత్మిక అంశాల మేళవింపు కనపడుతుంది. ఆలయం వెలుపల వేదాంతులు, రుషులు, సైంటిస్టులు మొదలైన వారి శిల్పాలు పెట్టి దానిని కాస్మోపాలిటన్ అభిరుచులకు అనుగుణంగా తీర్చి దిద్దారు.



Click it and Unblock the Notifications