గిరిజన మ్యూజియం, పూణే

హోమ్ » ప్రదేశములు » పూణే » ఆకర్షణలు » గిరిజన మ్యూజియం

పూణే జిల్లాలో ఉన్న గిరిజన మ్యూజియం చాల ప్రత్యేకమైనది. తూర్పు పూణే లోని కోరేగావ్ రోడ్ కు అవతలగా ఉన్న ఈ గిరిజన మ్యూజియం మహారాష్ట్ర లోని గిరిజనుల సంస్కృతిని, జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. గిరిజన పరిశోధన, శిక్షణ సంస్థ దీన్ని నిర్వహిస్తుంది.ఇక్కడ మరాయి, దంతేశ్వరి, బహిరం, వాఘ్దేవ్ జాతులకు సంబంధించిన చాల రకాల ఆయుధాలు, కళాకృతులు ప్రదర్శిస్తారు. గిరిజనులు కొలిచే దైవాల ప్రతిరూపాలు, వారి హస్తకళాకృతులు లాంటివి ఇక్కడ ఉంచారు. గిరిజన జీవనంపై తయారయిన పత్రికీకరణ చాల అద్భుతంగా వుంది, వారి జీవితాలు, సంస్కృతి పై చక్కని అవగాహన కలిగిస్తుంది.ఆదివారం తప్ప అన్ని రోజుల్లోనూ ఈ మ్యూజియం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల దాకా తెరిచి వుంటుంది.

Please Wait while comments are loading...