వీసాపూర్ కోట, లోహగడ్ – వీసాపూర్ కోట ద్వయం లో ఒకటి. పూణే లో వున్న ఈ కోట లోహగడ్ కోట పక్కనే 1085 అడుగుల ఎత్తులో నిర్మించారు. వేసాపూర్ గ్రామానికి దగ్గరలోని ఈ కోటని పేష్వ వంశం లోని మొదటి రాజు, శ్రీ బాలాజీ విశ్వనాధ్ కట్టించారు.ఈ కోట నిండా చాల గుహలు, స్తంభాలు, ఎత్తైన గోడలు, పురాతనమైన ఇల్లు వున్నాయి. కోట ఆవరణలో చాల హనుమాన్ మందిరాలు వున్నాయి. ప్రస్తుతం శిధిలంగా వున్న పేష్వ అంతఃపురం కూడా ఈ కోటలోనే వుంది.శాతవాహనుల నుంచి చాళుక్యుల దాక, మొఘలాయి రాజుల నుంచి మరాఠాల దాక, ఈ చారిత్రక కోట చాల వంశాల్ని రాజుల్ని చూసింది.



Click it and Unblock the Notifications